News April 1, 2024

పవన్.. ప్రజల మధ్య చిచ్చుపెడితే ఊరుకోం: వంగా గీత

image

పిఠాపురం వైసీపీ MLA అభ్యర్థి వంగా గీత జనసేనాని పవన్‌కు కౌంటర్ ఇచ్చారు. పిఠాపురంలో ఆలయాలపై దాడులు జరుగుతున్నాయంటూ చేబ్రోలు సభలో పవన్ మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారన్నారు. MLA, MPగా తాను 100 ఆలయాలను అభివృద్ధి చేశానని, మతపరమైన విషయాలను తెరపైకి తెచ్చి ప్రజల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తే ఊరుకోబోమని ఆమె హెచ్చరించారు. పవన్ గెలిస్తే ఏం చేస్తారో చెప్పకుండా వచ్చీరాని మాటలు మాట్లాడటం సరికాదన్నారు.

Similar News

News November 23, 2024

పిఠాపురం ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం

image

పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తూ సీఎస్ నీరభ్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి ఛైర్మన్‌గా కాకినాడ కలెక్టర్ వ్యవహరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నియోజకవర్గ MLAగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచాక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని గతంలో చెప్పిన విషయం తెలిసిందే.

News November 23, 2024

తూ.గో: ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యేలు

image

పీ.యు.సీ. కమిటీ ఛైర్మన్‌గా ఎంపికైన కూన రవి కుమార్ మైన్స్ & జియాలజీ, ఎక్సైజ్ శాఖా మాత్యులు కొల్లు రవీంద్ర, రాష్ట్ర ఎస్టిమేట్ కమిటీ సభ్యులుగా ఎంపికైన ఏలూరి సాంబశివరావు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణరెడ్డి ఇతర సభ్యులతో కలసి రాష్ట్ర ఎస్టిమేట్ కమిటీ చైర్మన్‌గా ఎన్నికైన సంధర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలియజేశారు.

News November 22, 2024

తూ.గో: CBI నుంచి అంటూ ఫేక్ కాల్

image

పి.గన్నవరానికి చెందిన ఓ వైద్యవిద్యార్థిని తండ్రికి గురువారం డిజిటల్ అరెస్ట్ కాల్ వచ్చింది. CBI నుంచి ఫోన్ చేస్తున్నామంటూ ఓ వ్యక్తి(పై ఫోటో) వాట్సాప్ కాల్ ద్వారా బెదిరించాడు. మీ కుమార్తెను అరెస్ట్ చేశామని, తమ అదుపులో ఉందని చెప్పాడు. అయితే కొద్దిసేపటి ముందే తన కుమార్తెతో మాట్లాడిన చంద్రశేఖర్ ఫేక్ కాల్ అని గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు. ఇలాంటి ట్రాప్ కాల్స్ వలలో పడొద్దని పోలీసులు సూచిస్తున్నారు.