News September 2, 2025
పవన్ బర్త్ డే.. ప్రకాశంలో జనసేన సిద్ధం.!

ప్రకాశం జిల్లాలో మంగళవారం డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించేందుకు జనసేన సిద్ధమవుతోంది. జిల్లా కేంద్రమైన ఒంగోలులో పలు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు జనసేన పార్టీ కార్యాలయం ప్రకటించింది. కేక్ కటింగ్, అన్నదాన కార్యక్రమాలు, నిత్యావసర సరుకులు పంపిణీ, పలు కార్యక్రమాలను ఈ సందర్భంగా నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.
Similar News
News September 2, 2025
జాన్ వెస్లీకి నివాళులర్పించిన ప్రకాశం ఎస్పీ

ఒంగోలులోని చర్చి కూడలి వద్ద గల జాన్ వెస్లీ ఐపీఎస్ విగ్రహానికి మంగళవారం జిల్లా ఎస్పీ దామోదర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. YSR భద్రతా అధికారిగా విధులు నిర్వహించిన జాన్ వెస్లీ హెలికాప్టర్ ప్రమాదంలో వైయస్సార్‌తోపాటు ప్రాణాలు అర్పించి అమరులయ్యారు. ఈ నేపథ్యంలో జాన్ వెస్లీ 16వ వర్ధంతిని పురస్కరించుకొని ఎస్పీ దామోదర్ నివాళులు అర్పించారు.
News September 2, 2025
ప్రకాశం జిల్లాలో మెరుపు దాడులు.!

ప్రకాశం జిల్లాలో ఎరువుల కేంద్రాలపై, యూరియా నిల్వలపై పోలీసులు మంగళవారం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. జిల్లా SP దామోదర్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహించారు. సాయంత్రానికి తనిఖీల ద్వారా షాపులపై చర్యలు తీసుకుంటారా అన్నది పోలీస్ అధికారులు ప్రకటించే అవకాశం ఉంది. ఈ తనిఖీల్లో DSPలు, CIలు, SIలు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
News September 2, 2025
మార్కాపురం: ప్రయాణికుడి కోసం రైలు వెనక్కి నడిపారు

గజ్జలకొండ-మార్కాపురం సెక్షన్లో సోమవారం రాత్రి రైల్వే సిబ్బంది మానవత్వం చాటుకున్నారు. రేపల్లెకు చెందిన కుటుంబం కొండవీడు ఎక్స్‌ప్రెస్‌లో గుంటూరు నుంచి బయలుదేరారు. ప్రయాణికుడు అదుపుతప్పి కింద పడిపోగా.. కుటుంబీకులు చైన్ లాగి సిబ్బందికి సమాచారమిచ్చారు. ఆ మార్గంలో మరో రైలుకు సిగ్నల్ ఇవ్వకుండా చర్యలు తీసుని రైలును సిబ్బంది కి.మీ వెనక్కి తీసుకెళ్లారు. బాధితుడిని MRK స్టేషన్లో దించి ఆసుపత్రికి తరలించారు.