News April 11, 2024
పవన్.. రాజకీయాల్లో నటించొద్దు ప్లీజ్: ముద్రగడ

‘సినిమాల్లో నటించండి. రాజకీయాల్లో నటించకండి ప్లీజ్..’ అంటూ పవన్‌పై ముద్రగడ పద్మనాభం సెటైర్స్ వేశారు. తాడేపల్లిగూడెంలో జరిగిన కాపు ఆత్మీయ సమావేశంలో గురువారం ముద్రగడ మాట్లాడుతూ.. పవన్ రాజకీయాల్లో నటించి యువతను పాడు చేయొద్దని అన్నారు. అధికారంలోకి వస్తే స్వచ్ఛ నీరు ఇస్తామని కాకుండా స్వచ్ఛ సారా అందిస్తామనడమేంటని ప్రశ్నించారు. పవన్ తాడేపల్లిగూడెం నుంచి పోటీ చేసి ఉంటే బాగుంటుందని ముద్రగడ అన్నారు.
Similar News
News April 20, 2025
రాజమండ్రి: మాజీ ఎంపీ పై మూడవ కేసు నమోదు

అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ పై రాజానగరం పోలీసులు శనివారం మరో కేసు నమోదు చేశారు. పాస్టర్ ప్రవీణ్ మృతి ఘటన ప్రాంతంలో కొవ్వొత్తుల ర్యాలీకి పిలుపు ఇవ్వడంపై అప్రమత్తమైన పోలీసులు ఎటువంటి అనుమతి తీసుకోకుండా పాస్టర్ ప్రవీణ్ మృతి చెందిన ఘటన స్థలం వద్ద కొవ్వొత్తులు ర్యాలీ నిర్వహించడంపై కేసు నమోదు పోలీసులు చేశారు. ఇది పాస్టర్ ప్రవీణ్ ఘటనకు సంబంధించి హర్ష కుమార్ పై నమోదైన మూడో కేసుగా పోలీసులు తెలిపారు.
News April 19, 2025
రాజమండ్రి: చంద్రబాబు రాజకీయ ప్రస్థానం స్ఫూర్తిదాయకం

సీఎం చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం స్ఫూర్తిదాయకమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆదివారం సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. పదిహేనేళ్లు సీఎంగా, ప్రతిపక్షనేతగా పనిచేయడం రాష్ట్ర చరిత్రలో ఎప్పటికీ రికార్డే అన్నారు. కీ.శే. ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెబితే వారిలోని ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన నాయకుడు చంద్రబాబు అన్నారు.
News April 19, 2025
పేరుపాలెం బీచ్‌లో గల్లంతైన యువకుడి మృతి

పేరుపాలెం బీచ్‌లో స్నానం చేస్తూ ఇద్దరు యువకులు గల్లంతైన విషయం తెలిసిందే. గుడ్ ఫ్రైడే పురస్కరించుకుని నల్లజర్ల మండలం ప్రకాశరావు పాలెంకు చెందిన సంకెళ్ల ఉదయ్ కిరణ్ (20) స్నానానికి వచ్చాడు. అలల ఉద్ధృతికి కొట్టుకుపోయి మృతి చెందాడు. మృతదేహాన్ని నరసాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరో యువకుడు భీమవరం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.