News December 17, 2025

పవన్, లోకేశ్‌లపై చంద్రబాబు ప్రశంసలు.. కలెక్టర్లకు దిశానిర్దేశం

image

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారులు నిత్య విద్యార్థుల్లా ఉంటూ, డేటా ఆధారిత పాలన సాగించాలని సూచించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాలనలో చక్కటి పనితీరు కనబరుస్తున్నారని ప్రశంసించారు. కానిస్టేబుల్ కోరిక మేరకు అక్కడికక్కడే రోడ్డు మంజూరు చేయడాన్ని గుర్తుచేశారు. అలాగే వైజాగ్‌కు గూగుల్ డేటా సెంటర్ తెచ్చిన మంత్రి లోకేశ్‌ను అభినందించారు.

Similar News

News December 17, 2025

కామారెడ్డి జిల్లాలో మూడో విడత తొలి ఫలితం

image

నస్రుల్లాబాద్ మండలం అంకోల్ క్యాంప్ సర్పంచ్ స్థానంపై ఉత్కంఠకు తెరపడింది. అంకోల్ క్యాంప్ సర్పంచ్‌గా అనిత-రాములు విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన అనితకు 209 మెజారిటీ వచ్చింది. తన సమీప ప్రత్యర్థి సావిత్రికి 36 ఓట్లు వచ్చాయి. 3 ఓట్లు చెల్లలేదు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

News December 17, 2025

పెద్దపల్లి జిల్లాలో ఓటింగ్ నమోదు ఎంతంటే..?

image

పెద్దపల్లి జిల్లాలోనీ గ్రామ పంచాయతీలలో ఉదయం ప్రారంభమైన పోలింగ్ ఒంటి గంటకు పూర్తయింది. పెద్దపల్లి మండలంలో 80.5%, సుల్తానాబాద్ మండలంలో 84.51%, ఎలిగేడు మండలంలో 83.02%, ఓదెల మండలంలో 82.85% నమోదు కాగా, మొత్తం పెద్దపల్లి జిల్లాలో 82.34% పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటల నుండి అనంతరం ఫలితాలను వెల్లడించనున్నారు.

News December 17, 2025

కేంద్ర సంస్కృత వర్సిటీలో ఉద్యోగాలు.. అప్లైకి 3రోజులే ఛాన్స్

image

న్యూఢిల్లీలోని కేంద్ర <>సంస్కృత <<>>యూనివర్సిటీలో 59 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అప్లై చేయడానికి 3రోజులే సమయం ఉంది. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని డిసెంబర్ 29 వరకు పంపాలి. పోస్టును బట్టి M.LI.Sc, మాస్టర్ డిగ్రీ, PhD/M.Phil, నెట్/SET/SLET అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం రూ.57,700- రూ.1,82,400 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.sanskrit.nic.in