News December 2, 2025
పవన్ సారీ చెబుతారా?

కోనసీమకు <<18446578>>దిష్టి<<>> తగిలిందంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పలువురు తెలంగాణ నేతలకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. పవన్‌ను బహిరంగంగానే తప్పు పడుతూ వెంటనే సారీ చెప్పాలని మంత్రులు కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో పాటు BRS నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆయన వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏదైనా కాస్త ఆలోచించి మాట్లాడి ఉండాల్సిందని మరికొందరు అంటున్నారు. దీనిపై పవన్ సారీ చెబుతారా? అనేది ఆసక్తికరంగా మారింది.
Similar News
News April 7, 2026
ఇలాంటి వారితో సమాజానికి ఉపయోగం ఉండదు!

ముష్టి వేపచెట్టు మొదలుగా బ్రజలకు
పరగ మూలికలకు పనికివచ్చు
నిర్దయుండు ఖలుడు నీచుడెందులకగు?
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: విషపూరితంతో పాటు ఔషధ గుణాలున్న ముష్టి(Nux vomica) చెట్టు, చేదుగా ఉండే వేప చెట్టు వివిధ రూపాల్లో ఈ లోకానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ దయ లేని వాడు, దుర్మార్గుడు ఈ సమాజానికి ఏ విధంగానూ ఉపయోగపడడు. పైగా హాని చేస్తాడు.
<<-se>>#PADHYAM<<>>
News April 7, 2026
IPL: నేడు ముంబైvsరాజస్థాన్

IPLలో ఈరోజు ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. గువాహటి వేదికగా 7.30PMకి మ్యాచ్ స్టార్టవుతుంది. టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు ఇరు జట్లు 30 సార్లు తలపడగా 16 విజయాలతో MI పైచేయి సాధించింది. 2021 నుంచి 8 మ్యాచుల్లో 5 విజయాలు నమోదు చేసింది. రెండు జట్లు బ్యాటింగ్, బౌలింగ్‌లో బ్యాలెన్స్‌డ్‌గా ఉండటంతో మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశముంది. MI కెప్టెన్ హార్దిక్ ఈ మ్యాచుకు అందుబాటులో ఉంటారని సమాచారం.
News April 7, 2026
ALERT.. నేటి నుంచి వర్షాలు

తెలంగాణలో నేటి నుంచి 3 రోజులపాటు వర్షాలు పడే అవకాశముందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈరోజు భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, NLG, సూర్యాపేట, MHBD, WGL, HNK, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. అటు ఏపీలో నేడు, రేపు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని APSDMA పేర్కొంది. నేడు ఉత్తర, కోస్తాంధ్ర ప్రాంతాల్లో వానలు పడతాయని వివరించింది.


