News December 2, 2025

పవన్ సారీ చెబుతారా?

image

కోనసీమకు <<18446578>>దిష్టి<<>> తగిలిందంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పలువురు తెలంగాణ నేతలకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. పవన్‌ను బహిరంగంగానే తప్పు పడుతూ వెంటనే సారీ చెప్పాలని మంత్రులు కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో పాటు BRS నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆయన వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏదైనా కాస్త ఆలోచించి మాట్లాడి ఉండాల్సిందని మరికొందరు అంటున్నారు. దీనిపై పవన్ సారీ చెబుతారా? అనేది ఆసక్తికరంగా మారింది.

Similar News

News March 9, 2026

కిమ్ వంతేనా? ట్రంప్ ‘డికాపిటేషన్’ స్కెచ్!(1/2)

image

అమెరికా అనుసరిస్తున్న ‘డికాపిటేషన్ స్ట్రైక్’ వ్యూహం ఇప్పుడు ప్రపంచ నియంతల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. మదురో బందీ కావడం, ఖమేనీ మృతిచెందడంతో.. తదుపరి లక్ష్యం ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కానున్నారా? అనే చర్చ మొదలైంది. అమెరికా పాత సిద్ధాంతం ‘లీడర్‌షిప్ టార్గెటింగ్’ను ట్రంప్ ఆచరణలోకి తేవడంతో ప్యాంగ్‌యాంగ్‌లో భయం నెలకొంది. అయితే తమ జోలికి వస్తే అణుదాడి తప్పదని కిమ్ హెచ్చరిస్తున్నారు.

News March 9, 2026

ఏంటీ ‘డికాపిటేషన్’ యుద్ధ తంత్రం?(2/2)

image

‘డికాపిటేషన్ స్ట్రైక్’ అంటే శత్రుదేశ టాప్ లీడర్‌షిప్పే లక్ష్యంగా నేరుగా చేసే మెరుపు దాడి. శరీరానికి మెదడు ఎంత ముఖ్యమో దేశానికి లేదా సైన్యానికి నాయకత్వం అంత ముఖ్యం. ఆ నాయకత్వాన్ని తొలగించడం ద్వారా శత్రువును అయోమయంలోకి నెట్టడం, స్తంభింపజేయడం లేదా పూర్తిగా లొంగదీసుకోవడమే ఈ వ్యూహం ఉద్దేశం. ఈ వ్యూహంలో భాగంగా క్షిపణులు లేదా డ్రోన్ల ద్వారా కీలక నేతలను హత్య చేస్తుంటారు. లేదా బందీ చేస్తారు.

News March 9, 2026

STRANGE: ఈ జీవికి మరణమే లేదు!

image

ఏ జీవికైనా మరణం తథ్యం. కానీ సముద్ర గర్భంలో జీవించే ‘Turritopsis dohrnii’ అనే జెల్లీఫిష్ మరణాన్ని జయిస్తూ శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఇది వయసైపోగానే లేదా ప్రమాదానికి గురైనప్పుడు తన కణాలను తిరిగి యవ్వన దశకు మార్చుకుంటుంది. అంటే అది తన జీవిత చక్రాన్ని వెనక్కి తిప్పుకుంటుంది. ప్రకృతిలో సహజ మరణం లేని ఏకైక ‘అమర జీవి’ ఇదే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో- వంద వింతలు’లో..