News February 23, 2026

పవర్‌ప్లేలో వికెట్లు పారేసుకున్నాం.. ఓటమిపై సూర్య కామెంట్స్!

image

SAతో భారీ ఓటమికి బౌలర్లు కారణం కాదని కెప్టెన్ సూర్య వారిని వెనకేసుకొచ్చారు. 188 రన్స్ ఛేజింగ్‌లో పవర్‌ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోవడం టీమ్ఇండియా కొంపముంచిందన్నారు. బౌలింగ్‌లో బుమ్రా, అర్ష్‌దీప్ రాణించినా.. మిగతా వారు ధారాళంగా రన్స్ ఇచ్చారు. అయినప్పటికీ బ్యాటర్ల వైఫల్యమే ఓటమికి ప్రధాన కారణమని సూర్య తేల్చేశారు. జింబాబ్వేతో జరిగే తదుపరి మ్యాచ్‌లో బౌన్స్‌ బ్యాక్ అవుతామని ధీమా వ్యక్తం చేశారు.

Similar News

News February 26, 2026

భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు

image

ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనలో కీలక ఒప్పందాలు కుదిరాయి. యూపీఐ చెల్లింపులు, విద్య, వ్యవసాయం, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏఐ, వాణిజ్యం, సైబర్ సెక్యూరిటీ, హెరిటేజ్, సర్వీస్ సెక్టార్లు సహా మొత్తం 27 రంగాలపై మోదీ-నెతన్యాహు సమక్షంలో ఇరుదేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం, ఇండియా-ఇజ్రాయెల్ మధ్య 100 ఎక్స్‌లెన్స్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

News February 26, 2026

వెస్టిండీస్ స్కోరు ఎంతంటే..

image

T20 WC: సౌతాఫ్రికాతో జరుగుతున్న సూపర్-8 పోరులో వెస్టిండీస్ 176-8 పరుగులు చేసింది. 83కే 7 వికెట్లు కోల్పోయిన దశలో షెఫర్డ్(52*), హోల్డర్(49) ముందుండి నడిపించారు. ఎంగిడి 3, బోష్, రబాడ తలో 2 వికెట్లు తీశారు. సౌతాఫ్రికా టార్గెట్ 177. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలిస్తే టీమ్ ఇండియా సెమీస్ అవకాశాలు మెరుగవుతాయి. ఒకవేళ ఓడితే మాత్రం జింబాబ్వే, వెస్టిండీస్‌పై భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది.

News February 26, 2026

ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

image

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ ఫ్లాట్‌గా ముగిశాయి. రోజంతా ఒడుదొడుకులకు లోనయ్యాయి. సెన్సెక్స్ 27 పాయింట్ల నష్టంతో 82,249 వద్ద, నిఫ్టీ 14 పాయింట్ల లాభంతో 25,497 వద్ద సెటిలయ్యాయి. సెన్సెక్స్‌లో BEL, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, మారుతీ సుజుకీ, ఎయిర్‌టెల్ షేర్లు లాభపడ్డాయి. ట్రెంట్, ఎటర్నల్, పవర్ గ్రిడ్, HDFC బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టపోయాయి.