News October 23, 2025

పవర్ గేమ్….మాజీ మేయర్ దంపతుల హత్యకు కారణం..!

image

చిత్తూరు మాజీ మేయర్ కటారి అనురాధ, భర్త మోహన్‌పై 2015 నవంబర్ 17న ఆమె కార్యాలయంలో దాడి జరిగి అనురాధ మరణించారు. అదే రోజు వెల్లూరు CMCలో చికిత్స పొందుతూ మోహన్ మరణించారు. ఈ హత్య కుటుంబ కలహాలు, తనకు సరైన పవర్ ఇవ్వలేదనే కారణాలతో సొంత మేనమామ, అత్తను చింటూ హత్య చేశారని అప్పటి పోలీస్ అధికారులు నివేదిక సమర్పించారు. ప్రధాన నిందితుడు చింటూ (శ్రీచంద్రశేఖర్) పక్క వ్యూహం ప్రకారం దాడి ప్లాన్ చేశారని ప్రకటించారు.

Similar News

News October 23, 2025

రంగారెడ్డి: బెగ్గింగ్ చేసి మరీ బోర్ రిపేర్!

image

తమ హయాంలో ఎంతో అభివృద్ధి జరిగిందని పాలకులు చెబుతుంటారు. ఇది సాదారణమే కానీ, తండాల్లో చిన్న సమస్య వస్తే GPల్లో నిధులు లేని దుస్థితి కనిపిస్తోంది. అవును.. తలకొండపల్లి మం. హర్యానాయక్ తండాలో నీటి మోటరు కాలిపోయింది. పంచాయతీ కార్యదర్శిని అడిగితే నిధులు లేవని సమాధానం వచ్చింది. దీంతో నీటి సమస్య తీర్చాలని కొందరు యువకులు ఇంటింటికి తిరిగి భిక్షాటన చేశారు. జమ అయిన రూ.5000తో బోరు రిపేర్ చేయించడం గమనార్హం.

News October 23, 2025

రంగారెడ్డి: బెగ్గింగ్ చేసి మరీ బోర్ రిపేర్!

image

తమ హయాంలో ఎంతో అభివృద్ధి జరిగిందని పాలకులు చెబుతుంటారు. ఇది సాధారణమే కానీ, తండాల్లో చిన్న సమస్య వస్తే GPల్లో నిధులు లేని దుస్థితి కనిపిస్తోంది. అవును.. తలకొండపల్లి మం. హర్యానాయక్ తండాలో నీటి మోటరు కాలిపోయింది. పంచాయతీ కార్యదర్శిని అడిగితే నిధులు లేవని సమాధానం వచ్చింది. దీంతో నీటి సమస్య తీర్చాలని కొందరు యువకులు ఇంటింటికి తిరిగి భిక్షాటన చేశారు. జమ అయిన రూ.5000తో బోరు రిపేర్ చేయించడం గమనార్హం.

News October 23, 2025

ఆర్టీసీలో ఇకపై అన్నీ విద్యుత్తు వాహనాలే

image

AP: RTCలో ప్రస్తుత బస్సుల స్థానంలో విద్యుత్ వాహనాలు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై CM CBN APSRTCకి ఆదేశాలిచ్చారు. ప్రతి 30 KMకి 1 ఛార్జింగ్ స్టేషన్‌, ఈ-మొబిలిటీ స్టార్టప్‌ల ప్రోత్సాహానికి 100 ఇన్‌క్యుబేషన్ కేంద్రాలు నెలకొల్పుతారు. E-VEHICLE ప్రాజెక్టు కోసం ₹500 CR ఇవ్వనున్నారు. కేంద్ర ‘PM E-DRIVE’ స్కీమ్ కింద ఉన్న ₹10,900 కోట్ల ఫండ్‌ను అందిపుచ్చుకొనేలా ప్రణాళికను రూపొందిస్తున్నారు.