News March 31, 2025
పవిత్ర ఖురాన్ బోధనలు సమాజానికి మేలు చేస్తున్నాయి: గవర్నర్

రంజాన్ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన విజయవాడ రాజ్ భవన్ నుంచి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పవిత్ర ఖురాన్ బోధనలు సమాజానికి మేలు చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో పేదలకు సహాయం చేసే ముస్లింలంతా భగవంతుడికి చేరువ అవుతారని గవర్నర్ వ్యాఖ్యానించారు.
Similar News
News April 2, 2025
దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే అక్రమార్కుడు: ఎమ్మెల్యే

దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే అభివృద్ధిని విస్మరించి అక్రమంగా రూ.కోట్లు ఆర్జించాడని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. సన్న బియ్యం పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. గ్రామాల్లో ఒక్క రేషన్ కార్డు కానీ,డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కానీ మాజీ ఎమ్మెల్యే ఇవ్వలేదన్నారు.గత ప్రభుత్వ పాలకులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి చిప్ప చేతికిచ్చారన్నారు. ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ సీఎం హామీలను అమలు చేస్తున్నారన్నారు.
News April 2, 2025
ఖమ్మం: సహకార పురోగతి ప్రగ్యా పథకంపై ప్రశ్నించిన ఎంపీ

సహకార ప్రగ్యా పథకం పురోగతి వివరాలు తెలపాలని.. దేశవ్యాప్తంగా ప్రాంతీయ శిక్షణ కేంద్రాల సంఖ్యను పెంచాలని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి కోరారు. మంగళవారం లోక్ సభలో ఆయన మాట్లాడారు. ఆ పథకానికి సంబంధించిన వివరాలు చెప్పాలన్నారు. దీనికి కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.
News April 2, 2025
నేడు పార్లమెంట్ ముందుకు వక్ఫ్ బిల్లు

కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లును ఇవాళ పార్లమెంట్ ముందుకు తీసుకురానుంది. తొలుత లోక్‌సభ, ఆ తర్వాత రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెడతారు. బిల్లుపై చర్చకు 8 గంటలు కేటాయిస్తున్నట్లు అధికారపక్షం తెలపగా, 12 గంటలు కేటాయించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అవసరమైతేనే సభా సమయం పొడిగిస్తామని స్పీకర్ ఓంబిర్లా తెలిపారు. ఈ బిల్లును కాంగ్రెస్, TMC, SP, MIM, DMK వంటి పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.