News October 24, 2024
పశుగణన సర్వేను పకడ్బందీగా నిర్వహించండి: కలెక్టర్

అక్టోబర్ 25 నుంచి ఫిబ్రవరి 2, 2025 వరకు నిర్వహించే అఖిలభారత పశుగణన సర్వేను జిల్లాలో పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.గురువారం స్థానిక కలెక్టరేట్ కలెక్టర్ చేతుల మీదుగా పశుగణన మాన్యువల్ బుక్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డా.కె.మురళీకృష్ణ, సహాయ సంచాలకులు నోయల్, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News September 15, 2025
ఆకివీడు తహశీల్దార్ నియామకంలో గందరగోళం!

ఆకివీడు రెవెన్యూ కార్యాలయంలో బదిలీల గందరగోళం ఏర్పడింది. తహశీల్దార్ వెంకటేశ్వరరావును కలెక్టరేట్‌కు బదిలీ చేశారు. ఆయన స్థానంలో ముందుగా ఆచంట డిప్యూటీ తహశీల్దార్ సోమేశ్వరరావును ఇన్‌ఛార్జ్ తహశీల్దార్‌గా నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు. అదే రోజు మళ్ళీ ఆదేశాలను రద్దు చేసి ఆకివీడు DT ఫరూక్‌కు బాధ్యతలిచ్చారు. MLA ఆదేశాలతోనే తొలుత ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేశారంటూ YCP శ్రేణులు ఆర్డర్ కాపీలను ట్రోల్ చేస్తున్నాయి.
News September 15, 2025
పాలకోడేరు: గోస్త నదిలో పడి ఒకటో తరగతి విద్యార్థి గల్లంతు

పాలకోడేరు(M) వేండ్ర శివారు కట్టవారిపాలెంకు చెందిన బొక్క శ్రీనివాస్ రావు రెండో కుమారుడు జైదేవ్(7) గోస్త నదిలో పడి ఆదివారం గల్లంతయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవుడూరులోని ప్రైవేట్ స్కూల్లో జైదేవ్ 1వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో తన స్నేహితుడితో కలిసి సైకిల్ తొక్కుతూ గోస్త నది వంతెన మీదకు వెళ్ళగా ప్రమాదవశాత్తు కాలుజారి పడి గల్లంతయ్యాడు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
News September 15, 2025
భీమవరం: ఉపాధి శ్రామికులకు బకాయి వేతనాల చెల్లింపు

ప.గో జిల్లాలో ఉపాధి శ్రామికులకు వేతన బకాయిలు విడుదల అయ్యాయి. జిల్లాలోని 99 వేల మందికి గాను రూ.55 కోట్లు మేర వారి అకౌంట్లలో అధికారులు జమ చేశారు. నాలుగు నెలలుగా వేతనాలు రాక శ్రామికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దసరా ముందు నిధులు విడుదల చేయడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి నిధుల విడుదలలో జాప్యం కారణంగానే ఆలస్యమైనట్లు అధికారులు చెబుతున్నారు.