News February 5, 2026
పశువుల పాలు పితికిన తర్వాత జాగ్రత్తలు

పాలు పితికిన తర్వాత పశువును అరగంట వరకు నేలపై పడుకోనీయకూడదు. పాలు పితకడం వల్ల పశువుల చనురంధ్రాలు తెరచుకొని ఉంటాయి. అప్పుడు ఆవు/గేదె పడుకుంటే ఆ రంధ్రాల నుంచి బ్యాక్టీరియా త్వరగా పొదుగులో చేరి పొదుగువాపు వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఒక పశువు పాలు తీసిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కున్న తర్వాతే మరో పశువు పాలు తీయాలి. దీని వల్ల ఒక పశువుకు ఉన్న అంటువ్యాధులు ఇతర పశువులకు వ్యాపించే ముప్పు తగ్గుతుంది.
Similar News
News February 12, 2026
2027 వరకు జిల్లాల మార్పు ఉండదు: రేవంత్

TG: జిల్లాల రద్దు ఉండదని ఇటీవల ప్రకటించిన సీఎం రేవంత్ తాజాగా.. 2027 వరకు జిల్లాల మార్పు ఉండదని పేర్కొన్నారు. అప్పుడు డీలిమిటేషన్‌తో పాటు ఉమెన్ రిజర్వేషన్ బిల్లు, సీట్ల పెంపు, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని స్పష్టం చేశారు. ఇక 2029లో జమిలి ఎన్నికలు రాబోతున్నాయని ఢిల్లీలో మీడియా చిట్ చాట్‌లో అన్నారు. అప్పటివరకు.. అంటే పదిన్నరేళ్లు తానే సీఎంగా ఉంటానని ధీమా వ్యక్తం చేశారు.
News February 12, 2026
నేనే రాజు.. నేనే మంత్రి: రేవంత్ రెడ్డి

ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో TG సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘తెలంగాణకు నేనే రాజు, నేనే మంత్రి. నాకు ఎవరూ పోటీ కాదు. పదిన్నరేళ్లు సీఎంగా ఉంటాను’ అని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఫోన్ ట్యాపింగ్ లాంటి పాపపు పనులు తాను చేయనని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ రావు అందరూ ఒకటేనని, టీఆర్ఎస్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉందని వ్యాఖ్యానించారు.
News February 12, 2026
‘ఖేలో ఇండియా’ నుంచి 1,342 మంది అథ్లెట్ల తొలగింపు

ఖేలో ఇండియా ప్రోగ్రామ్ నుంచి గత 3ఏళ్లలో 1,342 మంది అథ్లెట్లను తొలగించినట్లు కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ రాజ్యసభలో వెల్లడించారు. లో పర్ఫార్మెన్స్, డోపింగ్ ఉల్లంఘనలే ఇందుకు కారణమని చెప్పారు. 3ఏళ్లలో 2,905 మంది కొత్తగా చేరారని తెలిపారు. స్పోర్టింగ్ టాలెంట్‌ను గుర్తించి ట్రైనింగ్ ఇచ్చేందుకు కేంద్రం 2017లో ఈ ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసింది. దీని కింద ప్రస్తుతం 23K+ మంది అథ్లెట్లు శిక్షణ పొందుతున్నారు.


