News November 3, 2025
పశువుల పాలు పితికేటప్పుడు ఇవి గమనించాలి

రోజూ ఒకే సమయంలో పాలు పితకాలి. ఈ సమయంలో పశువు బెదరకుండా, చిరాకు పడకుండా చూడాలి. పాల సేపునకు అవసరమయ్యే ఆక్సిటోసిన్ హార్మోను మెదడు నుంచి విడుదలై రక్తప్రసరణలో కేవలం 8 నిమిషాలే ఉంటుంది. అందుకే పాలను 5-8 నిమిషాల లోపే తీయాలి. దీని వల్ల పాలలో పూర్తి వెన్నశాతం పొందొచ్చు. పాల తొలి ధారల్ని దూడలకు తాగించి, మలి ధారలను కేంద్రానికి పోయాలి. వీటిలో సుమారు 10% వెన్న ఉంటుంది. వీటిని దూడకు తాగించడం మంచిది కాదు.
Similar News
News November 3, 2025
విస్తృతంగా పర్యటించిన GWMC మేయర్, కమిషనర్

గ్రేటర్ వరంగల్ 13వ డివిజన్ పరిధిలోని చిన్నవడ్డెపల్లి చెరువు కట్ట, టీచర్స్ కాలనీ, ఇతర కాలనీలలో మేయర్ గుండు సుధారాణి, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ పర్యటించారు. తుఫాన్ ఎఫెక్ట్ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలలోకి ఇండ్లల్లోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారని, ప్రజలను ఆదుకోవాలని మేయర్, కమిషనర్లను స్థానిక కార్పొరేటర్ సురేష్ కుమార్ జోషి కోరుతూ వినతి పత్రం అందజేశారు.
News November 3, 2025
చెదిరిన కలలు, చెరిగిన జీవితాలు

21మంది చనిపోయిన మీర్జాగూడ రోడ్డు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. కాలేజీకి వెళ్తున్న స్టూడెంట్స్, ఉపాధి కోసం బయల్దేరిన కూలీలు, ఆస్పత్రిలో చికిత్స కోసం బస్సెక్కిన ఫ్యామిలీ, రైలు మిస్ కావడంతో బస్ అందుకున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. ఇలా ప్రతి ఒక్కరిదీ ఒక్కో కథ, కల. కానీ అవన్నీ ఒక్క ప్రమాదంతో కల్లలయ్యాయి. కంకర టిప్పర్ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు అందరి జీవితాలకు రాళ్ల సమాధి కట్టింది.
News November 3, 2025
సుప్రీం కోర్టుకు రాష్ట్రాల CSలు క్షమాపణలు

వీధికుక్కల వ్యవహారంలో AP సహా పలు రాష్ట్రాల CSలు సుప్రీంకోర్టు ముందు హాజరయ్యారు. అఫిడవిట్ల దాఖలు ఆలస్యానికి వారు క్షమాపణలు చెప్పారని సొలిసిటర్ జనరల్ కోర్టుకు నివేదించారు. తాము Oct 29నే అఫిడవిట్ ఇచ్చామని AP CS తెలిపారు. రాష్ట్రాల అఫిడవిట్ల ఆధారంగా స్ట్రే డాగ్స్ కోసం ఛార్ట్ రూపొందించాలని అమికస్ క్యూరీకి SC సూచించింది. కాగా కేసులో కుక్కకాటు బాధితులను ప్రతివాదులుగా చేర్చేందుకు కోర్టు అంగీకరించింది.


