News December 29, 2025
పశుసంవర్ధక రంగంతో ఆర్థిక పురోగతి: కలెక్టర్

పశుసంవర్ధక రంగాన్ని మరింత బలోపేతం చేసి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను స్థిరపరచవచ్చని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి అభిప్రాయపడ్డారు. సోమవారం పార్వతీపురం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశు సంబంధిత శాఖలతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులకు సమాచారాన్ని వేగంగా చేరవేయడానికి AI వంటి ఆధునిక కృత్రిమ మేథస్సును వినియోగించాలని సూచించారు.
Similar News
News January 3, 2026
భద్రాద్రి: ఈనెల 6 నుంచి ‘సదరం’ క్యాంపులు

కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఈ నెల 6 నుంచి ‘సదరం’ వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ విద్యాచందన ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 16 విభాగాలకు సంబంధించి ఈ నెల 6, 9, 20, 23, 27 తేదీల్లో 5 రోజుల పాటు ఈ క్యాంపులు జరుగుతాయని వివరించారు. దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్లాట్ బుక్ చేసుకున్న వారు నిర్ణీత తేదీల్లో ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలన్నారు.
News January 3, 2026
స్టబ్స్, రికెల్టన్‌కు షాక్.. కారణాలివే!

T20 WCకి సౌతాఫ్రికా ప్రకటించిన జట్టులో స్టబ్స్, రికెల్టన్‌కు చోటు దక్కలేదు. 2, 3 ఏళ్లుగా టీమ్‌లో రెగ్యులర్ కొనసాగుతున్న వీరికి సెలక్టర్లు షాక్ ఇచ్చారు. ఫామ్ లేమి కారణంగా స్టబ్స్‌ను, టాపార్డర్‌లో ఖాళీ లేకపోవడంతో రికెల్టన్‌ను పక్కనపెట్టినట్లు తెలుస్తోంది.
టీమ్: మార్క్రమ్(C), డికాక్, బ్రెవిస్, మిల్లర్, ఫెరీరా, జోర్జి, లిండే, జాన్సెన్, బాష్, ఎంగిడి, రబాడ, కేశవ్, నోర్ట్జే, మఫాకా, జాసన్ స్మిత్
News January 3, 2026
పవన్ కళ్యాణ్‌కు స్వాగతం పలకనున్న మంత్రి అడ్లూరి

నేడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటన సందర్భంగా ఆయనకు తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్వాగతం పలకనున్నారు. పర్యటనకు సంబంధించిన భద్రత, ట్రాఫిక్, భక్తులకు సౌకర్యాలు సహా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు. కొండగట్టులో పర్యటన సజావుగా సాగేందుకు శాఖల సమన్వయం పాటించాలని సూచించారు.


