News February 26, 2025
పశ్చిమగోదావరిలో TODAY TOP HEADLINES

✷ ప.గో జిల్లా రెండు రోజులపాటు జిల్లాలో వైన్ షాపుల బంద్
✷ జిల్లాలో మొదలైన శివరాత్రి ఉత్సవాలు
✷ ఉత్సవ ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ
✷ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సెలవు ప్రకటించిన కలెక్టర్
✷ మొగల్తూరులో చోరీ కేసులో నిందితుడికి జైలు శిక్ష
✷ నర్సాపురం శివరాత్రి ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ
Similar News
News February 25, 2025
ప.గో: కూటమి అభ్యర్థితో వైరల్ అవుతున్న పవన్ AI ఫొటో

ప.గో జిల్లాలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ AI ఫొటో వైరల్‌గా మారింది. జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి పట్టభద్రుల MLC కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్‌కి నిన్న మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన ఓ వీడియో ద్వారా సోమవారం తెలిపారు. అయితే ఆయన ఓటును అభ్యర్థిస్తూ AIతో చేసిన ఫొటోను కూటమి నేతలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది.
News February 25, 2025
ఏలూరు: మసాజ్ సెంటర్ కేసులో నిందితుడు అరెస్ట్

ఏలూరులో మసాజ్ సెంటర్ల పేరిట వ్యభిచారం నిర్వహించిన ఘటన ఇటీవల సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు భాను ప్రసాద్ పోలీసులకు చిక్కాడు. సోమవారం సాయంత్రం అతణ్ని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. అతనికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఏలూరు సబ్ జైలుకు తరలించారు.
News February 25, 2025
నవదంపతులను ఓటు అభ్యర్థించిన ఏపీఐఐసీ ఛైర్మన్

కాళ్ల మండలం కోపల్లె గ్రామంలో సోమవారం ఓ పెళ్లి ఫంక్షన్‌కి హాజరైన ఏపీఐఐసీ ఛైర్మన్, ఉండి మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజు నూతన వధూవరులను ఆశీర్వదించి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖరానికి ఓటు వేయాలని అభ్యర్థించారు. దీనితో వధూవరులు కూడా కూటమి ప్రభుత్వంకు మద్దతుగా ఓటు వేస్తామని ఆయనకి హామీ ఇచ్చారు. దంతులూరి శ్రీనివాసరాజు, బూడి వెంకట పర్రాలు, గడి రాము తదితరులు పాల్గొన్నారు.