News April 6, 2024
పశ్చిమ ప్రకాశంలో తాండవం చేస్తున్న నీటి కొరత

వేసవి కాలం ఆరంభంలోనే పశ్చిమ ప్రకాశంలో నీటి కొరత తాండవం చేస్తోంది. యర్రగొండపాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం తదితర 8 మండలాల పరిధిలో నీటి కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నాయి. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని అధికారులు భావించినప్పటికీ సాధ్యపడలేదు. ఆయా గ్రామాల్లోని ప్రజలు ఆందోళనలతో ప్రభుత్వం రోజుకు మనిషికి 40 లీటర్ల నీటిని సరఫరా చేస్తోంది. వీటిని 70 లీటర్లకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
Similar News
News April 21, 2025
మార్కాపురం: ❤ PIC OF THE DAY

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణ డ్రోన్ ఫొటో పలువురిని ఆకట్టుకుంది. శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. రథోత్సవంలో భాగంగా డ్రోన్ కెమెరా ఈ ఫొటోను క్లిక్ మనిపించింది. పట్టణంలోని వివిద్యుత్ కాంతుల్లో వెలిగిపోతున్న పట్టణ ఫొటోను స్థానికులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.
News April 21, 2025
ఒంగోలు: అంగన్వాడీలకు ఐటీసీ కిట్స్

అంగన్వాడీ కేంద్రాలలో ఉన్నటువంటి పిల్లల్లో నైపుణ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఐటీసీ వారు అందచేసిన అసెస్మెంట్ టూల్ కిట్, హబ్ అంగన్వాడీ మాడ్యూల్స్, పోస్టర్స్, బ్రోచర్స్, క్లాస్ మేనేజ్మెంట్ మెటీరియల్ను సోమవారం కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆవిష్కరించారు. ఈ మెటీరియల్ను జిల్లాలోని ప్రతి అంగన్వాడీ కేంద్రానికి అందచేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
News April 21, 2025
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టీచర్ పోస్టులు ఇలా..!

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో డీఎస్సీ ద్వారా<<16156012>> 629 పోస్టులు<<>> భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. రోస్టర్ వారీగా పోస్టులు ఇలా కేటాయిస్తారు.
➤ OC-259 ➤ BC-A:44 ➤ BC-B:58
➤ BC-C:08 ➤ BC-D:46 ➤ BC-E:25
➤ SC- గ్రేడ్1:08 ➤ SC-గ్రేడ్2:38.
➤ SC-గ్రేడ్3:48 ➤ ST:33 ➤ EWS: 61
➤ PHC-HH:1