News December 9, 2025

పశ్చిమ ప్రకాశం వాసులకు తీరనున్న ప్రయాణ కష్టాలు

image

ఏపీ ప్రభుత్వం మార్కాపురం జిల్లా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఒకప్పుడు జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే యర్రగొండపాలెం (135 km), మార్కాపురం (98 km), కనిగిరి (92 km)కి దూరం ప్రయాణించాల్సి వచ్చేదని పశ్చిమ ప్రకాశం ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు నూతన మార్కాపురం జిల్లాలో కలిపిన నియోజకవర్గాలకు జిల్లా కేంద్రం 65(km)లోపే ఉంటుంది. గిద్దలూరుకు మాత్రం ఒంగోలుతో పోల్చుకుంటే మార్కాపురం దగ్గరే.

Similar News

News February 1, 2026

దర్శిలో అడవి పంది దాడి.. వ్యక్తి మృతి

image

కురిచేడు మండలం బోధనంపాడు గ్రామ సమీపంలో అడవి పంది దాడిలో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. అగ్రహారం గ్రామానికి చెందిన రత్నం ఏడుకొండలు (41) ఆదివారం కంది కోయడానికి పొలానికి వెళ్లగా, అకస్మాత్తుగా అడవి పంది ఆయనపై దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దర్శి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News February 1, 2026

గ్రూప్-1 లో సత్తా చాటిన మద్దిపాడు MPDO

image

తాళ్లూరు మండలం తూర్పు గంగవరం చెందిన వల్లభనేని జ్యోతి S/O వల్లభనేని సుబ్బయ్య (నాగం బొట్లపాలెం సొసైటీ చైర్మన్) గ్రూప్-1లో సత్తా చాటారు. మద్దిపాడు మండలం MPDO గా విధులు నిర్వహిస్తున్న ఆమె గ్రూప్ వన్ రిజల్ట్స్‌లో అసిస్టెంట్ ట్రెజరర్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. పలువురు గ్రామస్థులు ఆమెకు అభినందనలు తెలిపారు.

News February 1, 2026

4న ఒంగోలుకు రానున్న శాసన సభ అంచనాల కమిటీ

image

రాష్ట్ర శాసన సభ అంచనాల కమిటీ ఫిబ్రవరి నెల 4వ తేదీన జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి రాజాబాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి నెల 4వ తేదీన ఉదయం 8.00 గంటలకు నెల్లూరు నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి ఒంగోలుకు చేరుకొని ఉదయం 11-00 గంటలకు ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహిస్తారని తెలిపారు.