News October 8, 2025

పసికందు మృతి ఘటనలో ఐసీడీఎస్‌ పీడీ సస్పెండ్‌

image

అనంతపురంలోని శిశు గృహంలో శిశువు ఆకలితో మృతి చెందిన ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనలో నిర్లక్ష్యం ప్రదర్శించారన్న అభియోగంతో ఐసీడీఎస్‌ పీడీ నాగమణిని అధికారులు సస్పెండ్‌ చేశారు. జిల్లా స్థాయిలో త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా మరికొందరు కాంట్రాక్ట్ అధికారులు, ఉద్యోగులపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. కలెక్టర్‌ ఆనంద్‌ నేడో, రేపు ఆదేశాలు జారీ చేసే అవకాశముంది.

Similar News

News October 8, 2025

భారీగా పెరిగిన బంగారం ధరలు

image

బంగారం ధరలు క్రమంగా పెరుగుతూ కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,150 పెరిగి తొలిసారి రూ.1,23,170కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.1,050 ఎగబాకి రికార్డు స్థాయిలో రూ.1,12,900 పలుకుతోంది. అటు KG వెండి ధర రూ.100 తగ్గి రూ.1,67,000కి చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News October 8, 2025

అనకాపల్లి: 9 స్కూల్ గేమ్స్ ఎంపిక పోటీలు

image

ఉమ్మడి విశాఖ జిల్లా అండర్-19 స్కూల్ గేమ్స్ ఎంపిక పోటీలు 9 నుంచి 19 వరకు నిర్వహించనున్నట్లు అనకాపల్లి జిల్లా ఇంటర్ అధికారి వినోద్ బాబు తెలిపారు. జిల్లాస్థాయిలో జరిగే ఎంపిక పోటీల్లో 2007 తర్వాత జన్మించిన వారు అర్హులుగా పేర్కొన్నారు. గోపాలపట్నంలో 9న బ్యాట్మెంటన్, నక్కపల్లిలో 10న హాకీ, పోటీలు జరుగుతాయన్నారు. ఉమ్మడి జిల్లాలో వివిధ చోట్ల కబడ్డీ, క్రికెట్, చెస్ వాలీబాల్ తదితర పోటీలు నిర్వహిస్తామన్నారు.

News October 8, 2025

‘అనకాపల్లి-తిరుపతి ట్రైన్‌లో జనరల్ బోగీలు ఏర్పాటు చేయాలి’

image

అనకాపల్లి-తిరుపతి స్పెషల్ ట్రైన్‌లో సామాన్య ప్రయాణికులకు జనరల్ బోగీలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌లు వినిపిస్తున్నాయి. ప్రతి సోమవారం అనకాపల్లి నుంచి నడిచే ఈ రైల్లో అన్ని ఏసీ బోగీలో కావడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు నిరాశ పడుతున్నట్లు తెలిపారు. సామాన్య ప్రజలు ప్రయాణించే అవకాశం కల్పించాలన్నారు.