News January 11, 2026

పసిపిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?

image

శీతాకాలంలో పసిపిల్లలు ఎక్కువగా జలుబుకు గురవుతారు. అయితే ఈ లక్షణాలను ముందుగానే గుర్తిస్తే చికిత్స అందించడం సులువవుతుందంటున్నారు నిపుణులు. శిశువు చేతులు, కాళ్లు చల్లగా ఉండటం, చర్మం పాలిపోయినట్టు/ నీలం రంగులో కనిపించడం వంటి లక్షణాలు ఉండవచ్చు. అలాగే శ్వాస వేగంగా తీసుకోవడం, తరచుగా తుమ్మడం, ముక్కు మూసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

Similar News

News February 5, 2026

‘ఇండిగో’పై విచారణకు CCI DG ఆదేశం

image

2025 DECలో ఇండిగో విమాన సర్వీసుల రద్దుపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(CCI) DG విచారణకు ఆదేశించారు. DGCA డేటా ఇన్‌పుట్‌లను పరిశీలించి కృత్రిమ కొరత సృష్టించడానికి ఇండిగో ఇలా చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేసినట్లు తేల్చారు. ఆ సమయంలో లక్షలాది మంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 2 నెలల తరువాత ఇప్పుడు దర్యాప్తునకు ఆదేశించారు. ఇండిగో విధానాలపై లోతుగా దర్యాప్తు చేయనున్నారు.

News February 5, 2026

మరోసారి చంద్రబాబు, పవన్ భేటీ.. ఏం జరుగుతోంది?

image

AP: సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరుసగా రెండో రోజు సమావేశమయ్యారు. ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, పలువురు మంత్రులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. కల్తీ నెయ్యి అంశంపై ఎలా ముందుకెళ్లాలనే దానిపైనే ప్రధానంగా చర్చ సాగుతున్నట్లు సమాచారం. అలాగే కూటమి సమన్వయం, వైసీపీ ఆరోపణలను తిప్పికొట్టడంపైనా సమాలోచనలు చేస్తున్నారు. అగ్రనేతల సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

News February 5, 2026

చిత్తరంజన్ లోకో‌మోటివ్ వర్క్స్‌లో ఉద్యోగాలు

image

<>చిత్తరంజన్ <<>>లోకో‌మోటివ్ వర్క్స్ 4 మెడికల్ ప్రాక్టీషనర్/స్పెషలిస్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల వారు ఫిబ్రవరి 24న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి MBBS, PG, PG డిప్లొమా అర్హతతో పాటు పనిఅనుభవం ఉండాలి. జనరల్ డ్యూటీ మెడికల్ ప్రాక్టీషనర్‌కు నెలకు రూ.95,000, స్పెషలిస్ట్‌కు రూ.1,23,500 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://clw.indianrailways.gov.in.