News December 11, 2025

పసిబిడ్డకు పన్నెండు గంటల నిద్ర కావాల్సిందే..

image

ఏడాదిలోపు పసిపిల్లలకు రోజుకి 12-16 గంటలు నిద్ర అవసరం. రెండేళ్ల లోపువారైతే 8-14 గంటలు నిద్ర ఉండాలంటున్నారు నిపుణులు. మెదడు ఆరోగ్యంగా ఉండాలన్నా, ఎదగాలన్నా, శారీరక ఎదుగుదల బావుండాలన్నా పసిపిల్లలు రోజులో సగభాగం నిద్రలో ఉంటేనే మంచిది. సరిపోయినంతగా నిద్ర ఉంటే, ఎదిగిన తర్వాత వారిలో ఆలోచనాశక్తి, సమస్యను పరిష్కరించే నైపుణ్యం, జ్ఞాపకశక్తితోపాటు మెరుగైన మానసికారోగ్యాన్ని పొందుతారని చెబుతున్నారు.

Similar News

News December 13, 2025

టెన్త్ అర్హతతో 714 పోస్టులు.. నోటిఫికేషన్ విడుదల

image

ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ 714 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 17 నుంచి JAN 15 వరకు అప్లై చేసుకోవచ్చు. టెన్త్ ఉత్తీర్ణత, 18-27 ఏళ్ల వయసున్న వారు అర్హులు. రిజర్వేషన్‌ను బట్టి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం ₹18,000-₹56,900 వరకు చెల్లిస్తారు.
వెబ్‌సైట్: https://dsssb.delhi.gov.in/

News December 13, 2025

బత్తాయిలో ఆకుముడత, మంగునల్లి కట్టడికి జాగ్రత్తలు

image

☛ బత్తాయిలో ఆకుముడత పురుగు రాకుండా ముందు జాగ్రత్తగా లీటరు నీటికి వేపనూనె 5 మి.లీ. కలిపి పిచికారీ చేయాలి. ఒకవేళ పురుగు ఉద్ధృతి ఎక్కువగా ఉంటే ప్రొఫెనోఫాస్ 1.5 మి.లీ. మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
☛ బత్తాయిలో మంగునల్లి నివారణకు నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా డైకోఫాల్ 3ml లేదా ప్రాపర్ జైట్ 1ml మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

News December 13, 2025

డ్రీం ఫీడింగ్ గురించి తెలుసా?

image

డెలివరీ తర్వాత పిల్లలు చాలాకాలం రాత్రిళ్లు లేచి ఏడుస్తుంటారు. అయితే దీనికి డ్రీం ఫీడింగ్ పరిష్కారం అంటున్నారు నిపుణులు. డ్రీం ఫీడింగ్ అంటే నిద్రలోనే బిడ్డకు పాలివ్వడం. ముందు బేబీ రోజూ ఒకే టైంకి పడుకొనేలా అలవాటు చెయ్యాలి. తర్వాత తల్లి నెమ్మదిగా బిడ్డ పక్కన పడుకుని బిడ్డకు చనుబాలివ్వాలి. ఆ సమయంలో బిడ్డను మెల్లిగా ఎత్తుకోవాలి. ఇలా చేయడం వల్ల బిడ్డ రాత్రంతా మేలుకోకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.