News December 22, 2025
పాకాల: 50 మందికి కారుణ్య నియామక పత్రాల అందజేత

ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో కారుణ్య నియామకాల కింద 50 మందికి నియామక పత్రాలను సోమవారం మంత్రి గొట్టిపాటి రవికుమార్ అందజేశారు. మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రం క్లీన్ ఎనర్జీ దిశగా ముందుకు సాగుతోందన్నారు. ఉద్యోగుల సమష్టి కృషితోనే వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందుతున్నాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ రంగంలో 250 మందికి కారుణ్య నియామకాలు కల్పించామని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News December 23, 2025
ట్రంప్ నోట మళ్లీ అదే మాట!

భారత్, PAK మధ్య అణు యుద్ధం జరగకుండా ఆపినట్లు US అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ప్రకటించుకున్నారు. దీంతో 10మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలను కాపాడినట్లు పాక్ PM చెప్పినట్లు వివరించారు. పహల్గామ్ దాడి తర్వాత ఇరుదేశాల మధ్య జరిగిన ఘర్షణల్లో 8 విమానాలు నేలకొరిగాయన్నారు. 8 యుద్ధాలు ఆపానని, తాను పరిష్కరించని ఏకైక యుద్ధం ఉక్రెయిన్-రష్యాదే అని తెలిపారు. పుతిన్, జెలెన్‌స్కీ మధ్య విపరీతమైన ద్వేషం ఉందని చెప్పారు.
News December 23, 2025
మేడారానికి మంత్రి కొండా దూరం!

మేడారంలో ముగ్గురు మంత్రులు మంగళవారం పర్యటించనున్నారు. దేవాదాయ శాఖ కిందకు వచ్చే మేడారం జాతర పనుల రివ్యూకు మంత్రి కొండా సురేఖ హాజరు కావడం లేదు. వరంగల్ నగరంలో పర్యటన ఉన్నా, మేడారానికి రావడం లేదని తెలుస్తోంది. మంత్రుల శాఖల మధ్య విభేదాలు ఇంకా సమసిపోనట్టు సమాచారం. మంత్రికి అనుకూలంగా పని చేసిన ముగ్గురు పోలీసులపై వేటు వేయడంపై గ్యాప్ మరింత పెరిగినట్టు తెలుస్తోంది.
News December 23, 2025
రావికమతం: చీరకు నిప్పంటుకున్న మహిళ మృతి

రావికమతం మండలం మేడివాడ పంచాయతీ శివారు అప్పలమ్మపాలెం గ్రామానికి చెందిన పాచిల చిలకమ్మా (60) కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. సోమవారం సాయంత్రం చలి మంట కోసం ఆమె నిప్పు పెడుతుండగా చీరకు అంటుకుని శరీరం సగానికి పైగా కాలిపోయింది. పరిస్థితి విషమించడంతో అనకాపల్లి ఆస్పత్రి నుంచి సోమవారం రాత్రి విశాఖ KGHకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించిందని ఆమె మనవడు అర్జున్ తెలిపారు.


