News February 28, 2026
పాకిస్థాన్ పిల్లలు, మహిళలను చంపుతోంది: అఫ్గాన్

పాకిస్థాన్ యుద్ధనీతిని విస్మరిస్తోందని అఫ్గానిస్థాన్ మండిపడింది. తాలిబన్లపై ప్రతీకారం తీర్చుకునేందుకు అఫ్గాన్ ముస్లిం పౌరులు, పిల్లలను చంపాలని పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఆదేశాలు జారీ చేశారని స్టేట్‌మెంట్ రిలీజ్ చేసింది. ఖోస్ట్, పక్తియాలోని సామాన్యుల ఇళ్లను టార్గెట్ చేసి దాడులకు పాల్పడుతోందని, ఇందులో 19 మంది పౌరులు చనిపోయారని పేర్కొంది. అందులో ఎక్కువ మంది మహిళలు, పిల్లలే ఉన్నారని తెలిపింది.
Similar News
News February 28, 2026
ఫ్రీగా HPV వ్యాక్సిన్.. ఎక్కడెక్కడ వేస్తారంటే?

TG: గర్భాశయ క్యాన్సర్ నివారణే లక్ష్యంగా రాష్ట్రంలో <<19260855>>HPV వ్యాక్సినేషన్<<>> డ్రైవ్ ప్రారంభమైంది. నేటి నుంచి 3 నెలల పాటు 14-15 ఏళ్ల బాలికలకు ఉచితంగా టీకాలు వేస్తారు. మొదటి నెల రోజులు గవర్నమెంట్ ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటాయి. తర్వాత PHCలలోనూ అందుబాటులోకి తేనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఈ టీకా డోసు ధర ₹3k-4k ఉంటుందని పేర్కొన్నారు.
News February 28, 2026
3,979 పోస్టులు.. దరఖాస్తుకు 3రోజులే ఛాన్స్

యంత్ర ఇండియా లిమిటెడ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలలో 3,979 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇంకా 3 రోజులే(మార్చి 3) సమయం ఉంది. ITI, టెన్త్ అర్హత గలవారు అప్లై చేసుకోవచ్చు. మెరిట్, DV, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. టెన్త్ అభ్యర్థులకు నెలకు రూ.8200, ITI అభ్యర్థులకు రూ.9600 స్టైపెండ్ చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.200+GST, SC, ST, మహిళలకు రూ.100+GST. వెబ్‌సైట్: recruit-gov.com/
News February 28, 2026
కొత్త CSగా సాయిప్రసాద్ బాధ్యతలు

AP: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS)గా జి.సాయిప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు తాజా మాజీ సీఎస్ విజయానంద్, ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపారు. సాయి ప్రసాద్ 1991 IAS బ్యాచ్‌కు చెందిన అధికారి. తొలుత ఉమ్మడి APలో వరంగల్ అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేశారు. ఆపై పలు జిల్లాల్లో విధులు నిర్వర్తించారు. 2024 నుంచి జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న ఆయన CSగా ఎంపికయ్యారు.


