News February 15, 2026
పాక్‌తో ఇవాళే మ్యాచ్.. చక్ దే ఇండియా!

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పోరుకు వేళయింది. T20 WCలో భాగంగా ఇండియా, పాకిస్థాన్ మధ్య ఇవాళ సాయంత్రం 7 గంటలకు <<19134206>>మ్యాచ్ ప్రారంభం<<>> కానుంది. ఈ టోర్నీ చరిత్రలో పాక్‌తో ఆడిన 8 మ్యాచుల్లో 7 మన జట్టే గెలిచింది. ఆ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఆ టీమ్‌ను మట్టికరిపించాలని భారత్ ఉవ్విళ్లూరుతోంది. బ్యాటింగ్‌లో అభిషేక్, సూర్య, బౌలింగ్‌లో బుమ్రా, వరుణ్ చెలరేగితే గెలుపు మనదే. చక్ దే ఇండియా!
Similar News
News February 16, 2026
టెక్నాలజీతో పౌర సేవకు బిల్‌గేట్సే ప్రేరణ: సీఎం

AP: రాష్ట్రంలోని ప్రజల జీవితాలను రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్(RTGS) మారుస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. టెక్నాలజీ మానవాళికి ఉపయోగపడాలన్నారు. 1990లలో బిల్‌గేట్స్‌తో మీటింగ్ తర్వాత సాంకేతికత ద్వారా పౌర సేవకు ప్రేరణ కలిగిందని Xలో గుర్తు చేసుకున్నారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయంతో సహా అనేక కార్యక్రమాలతోపాటు యంగ్ మైండ్స్‌తో నిండిఉన్న RTGS కేంద్రాన్ని బిల్ గేట్స్ సందర్శించడం సంతోషంగా ఉందని చెప్పారు.
News February 16, 2026
650 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News February 16, 2026
ఛైర్మన్ పదవులకు తీవ్ర పోటీ… INC రాజీఫార్ములా

TG: మున్సిపల్ ఛైర్మన్ పదవులకు పోటీ తీవ్రంగా ఉండడంతో INC రాజీఫార్ములాకు తెరతీసింది. ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులను చెరిసగం కాలం పంచుకునేలా పోటీపడుతున్న నేతలను ఒప్పించింది. కోదాడ, నేరేడుచర్లతో పాటు కరీంనగర్లోని 2 చోట్ల దీన్ని అమలు చేసింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని కొన్ని మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి తలెత్తడంతో జిల్లా మంత్రులు, ఇన్‌ఛార్జి మంత్రులు నేతలతో చర్చించి సర్దుబాటు చేపట్టారు.


