News February 1, 2026

పాక్‌తో మ్యాచ్.. భారత్ బ్యాటింగ్

image

ఐసీసీ U19 వన్డే వరల్డ్ కప్‌లో భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
IND: ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే(C), విహాన్ మల్హోత్రా, అభిజ్ఞాన్ కుందు(w), వేదాంత్ త్రివేది, అంబరీశ్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, దీపేశ్ దేవేంద్రన్

Similar News

News February 5, 2026

దివ్యాంగులకు ఫ్రీగా 5G ఫోన్లు, బ్యాటరీ సైకిళ్లు

image

TG: దివ్యాంగులకు మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రై సైకిళ్లు, వీల్ చైర్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, 5G స్మార్ట్ ఫోన్లు ఫ్రీగా ఇవ్వనున్నట్లు దివ్యాంగుల కో-ఆపరేటివ్ కార్పొరేషన్ ఛైర్మన్ వీరయ్య వెల్లడించారు. ఇందుకోసం OBMMS <>పోర్టల్‌<<>>లో ఈ నెల 10లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. గతంలో అప్లై చేసి పరికరాలు పొందని వారూ ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చని, వివరాలకు 9959583502 నంబర్(10am-6pm)లో సంప్రదించాలన్నారు.

News February 5, 2026

25,000 మంది ఫ్రెషర్లను తీసుకుంటాం: కాగ్నిజెంట్

image

IT సంస్థ కాగ్నిజెంట్ ఈ ఏడాది దాదాపు 25K మంది ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకోనున్నట్లు వెల్లడించింది. 2025లో 20K మంది గ్రాడ్యుయేట్లను నియమించుకున్నామని, ఈ సంఖ్యను 20 శాతం మేర పెంచుతామని సంస్థ CEO రవికుమార్ తెలిపారు. AI ద్వారా ఎంట్రీ లెవెల్‌ ఉద్యోగులకు అత్యున్నత సాంకేతిక నైపుణ్యాన్ని అందిస్తామన్నారు. IITలలో క్యాంపస్ ఇంటర్వ్యూలు, ఇతర మార్గాల ద్వారా ప్రోగ్రామర్లు, ఇంజినీర్లను తీసుకుంటామని పేర్కొన్నారు.

News February 5, 2026

ఫైబ్రోసిస్టిక్ బ్రెస్ట్ ఛేంజెస్ లక్షణాలు

image

ఫైబ్రోసిస్టిక్ బ్రెస్ట్ ఛేంజెస్ సమస్య ఉన్న మహిళల్లో రొమ్ము వాపులు, నొప్పి, రొమ్ముల్లో కణితులు, రొమ్ముల దగ్గర చర్మం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మరికొందరు మహిళల్లో అయితే రొమ్ముల నుంచి ఆకుపచ్చ లేదా గోధుమ రంగు రక్తస్రావం కూడా జరుగుతుంది. ఇలా ఎక్కువగా జరుగుతున్నట్లయితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ వ్యాధిని నిర్ధారించడానికి డిజిటల్ మమోగ్రఫీ, అల్ట్రాసౌండ్ వంటి పరీక్షలు చేస్తారు.