News February 8, 2026

పాక్ ఏజెంట్‌తో గొగొయ్‌కి సంబంధాలు: CM

image

కాంగ్రెస్ MP గౌరవ్ గొగొయ్‌పై అస్సాం CM హిమంత బిశ్వ శర్మ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘పాక్ ఏజెంట్ అలీ తౌఖీర్‌‌తో గౌరవ్ గొగొయ్‌, ఆయన భార్య ఎలిజబెత్‌(బ్రిటిష్ పౌరురాలు)కి సంబంధాలున్నాయి. 44పేజీల SIT నివేదిక ప్రకారం ఆమె కీలక సమాచారం పంచుకున్నట్లు ఉంది. పాక్‌కు చెందిన ఓ సంస్థ ఆమెకు జీతమిచ్చింది. గొగొయ్‌తో వివాహమయ్యాక ఆమె 9సార్లు పాక్ వెళ్లారు. గౌరవ్ కుటుంబంలో మరొకరు పాక్‌కు సహకరిస్తున్నారు’ అని ఆరోపించారు.

Similar News

News February 9, 2026

పెన్షన్ల పెంపుపై కసరత్తు!

image

TG: చేయూత పెన్షన్లను పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక పరిమితుల దృష్ట్యా 2026-27 బడ్జెట్‌లో ₹1,000, 2027-28 బడ్జెట్‌లో మరో ₹1,000 పెంచాలని పరిశీలిస్తోంది. మార్చిలో బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు CM రేవంత్ దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఆర్థిక శాఖ అదనపు నిధుల కోసం అన్వేషిస్తోంది. పెన్షన్‌ను ₹2,000 నుంచి ₹4,000కి పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

News February 9, 2026

పులి ఎదురుపడితే ఏం చేయాలి?

image

తెలుగు రాష్ట్రాల్లో <<19045804>>పులుల<<>> బెడదతో రైతులు పొలాలకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. పులి ఎదురుపడినప్పుడు అరుస్తూ పరిగెత్తడం, దాక్కోవడం వంటివి చేయొద్దని అటవీ అధికారులు చెబుతున్నారు. పులికి మనం ఆహారం కాదనే స్పష్టమైన సందేశం ఇచ్చేలా దాని కళ్లలోకి చూస్తూ కదలకుండా ఉండాలంటున్నారు. మనం పెద్దగా కనిపించినప్పుడు పులి వేటాడకుండా వెనక్కి తగ్గుతుందట. తమ కంటే పెద్ద ఆకారంలో ఉండేవాటిపై దాడి చేయకపోవడం అడవి జంతువుల లక్షణం.

News February 9, 2026

బాడీ షేమింగ్ చేస్తే శిక్ష పడుతుందని తెలుసా?

image

వాక్ స్వాతంత్ర్యం అనే పేరుతో చాలామంది జోకులు, వ్యంగ్యంగా ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారు. అలాంటి వాటిలో బాడీ షేమింగ్ ప్రధానంగా ఉంటుంది. ఇవి బాధితుల్లో మానసిక ఒత్తిడి, ఇబ్బందిని పెంచి.. ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. అయితే దీని కోసం ప్రత్యేక చట్టాలు లేవు కానీ బాధితులు పరువునష్టం కింద కేసు నమోదు చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. దోషిగా తేలితే రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు.