News September 10, 2025

పాక్ జాతీయుడిని స్వదేశానికి పంపిన హైదరాబాద్ పోలీసులు

image

చట్టవిరుద్ధంగా దేశంలోకి ప్రవేశించిన ఓ పాకిస్థాన్ జాతీయుడిని హైదరాబాద్ పోలీసులు స్వదేశానికి పంపించారు. మహ్మద్ ఉస్మాన్(48) అనే వ్యక్తి నేపాల్ మీదుగా 2011లో భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించాడు. హైదరాబాద్‌లో నాలుగు క్రిమినల్ కేసుల్లో ఇతడు నిందితుడు. శిక్షాకాలం పూర్తయిన తర్వాత ఇతడిని సెప్టెంబర్ 9న అటారీ సరిహద్దు వద్ద పాకిస్థాన్ రేంజర్స్‌కు అప్పగించారు.

Similar News

News September 11, 2025

NTR: MBA పరీక్షల రీవాల్యుయెషన్ ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలలో జనవరి 2025లో నిర్వహించిన MBA( హాస్పిటల్ మేనేజ్మెంట్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్) 1,3వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల రీవాల్యుయెషన్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఫలితాలకై https://www.nagarjunauniversity.ac.in/ చూడాలని ANU పరీక్షల విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది.

News September 11, 2025

సెప్టెంబర్ 11: చరిత్రలో ఈరోజు

image

1906: దక్షిణాఫ్రికాలో మహాత్మా గాంధీ సత్యాగ్రహం ప్రారంభం
1911: భారత మాజీ కెప్టెన్ లాలా అమర్‌నాథ్ జననం
1895: స్వాతంత్ర్య సమరయోధుడు వినోబా భావే జననం
1947: కవి దువ్వూరి రామిరెడ్డి మరణం
1948: పాకిస్థాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా మరణం
2022: నటుడు కృష్ణంరాజు మరణం (ఫొటోలో)
☞ జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం

News September 11, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (సెప్టెంబర్ 11, గురువారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.51 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.04 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.13 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.37 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.22 గంటలకు
✒ ఇష: రాత్రి 7.34 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.