News October 27, 2025
పాగుంట వెంకన్న హుండీ ఆదాయం రూ.11,26,292

కేటీదొడ్డి మండలం పాగుంట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. దేవాదాయ శాఖ గద్వాల డివిజన్ పరిశీలకులు వెంకటేశ్వరి, ఆలయ కార్యనిర్వాహణాధికారి ఆర్.పురేందర్ కుమార్, గ్రామ పెద్దలు, భక్తుల సమక్షంలో లెక్కింపు జరిగింది. గత 11 నెలలకు గాను హుండీ ఆదాయం మొత్తం రూ.11,26,292 వచ్చాయని అధికారులు పేర్కొన్నారు.
Similar News
News October 27, 2025
ఇది మోదీ, ఈసీల బహిరంగ ఓట్ల దొంగతనం: కాంగ్రెస్

EC ప్రకటించిన రెండో దశ <<18119730>>SIR<<>>పై కాంగ్రెస్ మండిపడింది. 12 రాష్ట్రాలు, UTల్లో ఓట్ చోరీ ఆట ఆడేందుకు EC సిద్ధమైందని విమర్శించింది. బిహార్‌లో 69 లక్షల ఓట్లను తొలగించిందని, ఇప్పుడు కోట్ల ఓట్లను డిలీట్ చేసేందుకు రెడీ అవుతోందని ఆరోపించింది. ఇది మోదీ, ఈసీ కలిసి చేస్తున్న బహిరంగ ఓట్ల దొంగతనమని ట్వీట్ చేసింది. మరోవైపు SIRను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు కేరళ సీఎం విజయన్, తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రకటించారు.
News October 27, 2025
హైదరాబాద్ సిటీ పోలీసుల మెగా రక్తదాన శిబిరం

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ సిటీ పోలీసులు సోమవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. 12 జోన్లలో జరిగిన ఈ శిబిరంలో సుమారు 3,500 మంది దాతలు రక్తం ఇచ్చారు. థలసేమియా రోగుల కోసం ఈ కార్యక్రమం చేపట్టారు. అమరవీరుల త్యాగానికి ఇది నివాళి. తెలంగాణ డీజీపీ బి.శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. “రక్తదానం ప్రాణదానంతో సమానం” అని తెలిపారు. పోలీసులు, పౌరులు ఇందులో పాల్గొన్నారు.
News October 27, 2025
కందుకూరును ప్రకాశం జిల్లాలో కలపాలి: JAC

కందుకూరు జేఏసీ నేతలు సోమవారం కలెక్టర్ హిమాన్షు శుక్లాకు వినతిపత్రం అందజేశారు. కందుకూరు ప్రాంత ప్రజల ఆకాంక్ష మేరకు కందుకూరును తిరిగి ప్రకాశం జిల్లాలో కలపాలని వారు కోరారు. ఇందుకు నెల్లూరు నేతల అడ్డగింత సరికాదని విమర్శించారు. ప్రజల సెంటిమెంట్‌కు అనుగుణంగా ప్రభుత్వం త్వరలో సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు.


