News February 7, 2025
పాచిపెంటలో యువకుడి మృతి

పాచిపెంట మండలం పీ.కొనవలస ఘాట్ రోడ్డులో గురువారం స్కూటీని లారీ ఢీ కొట్టడంతో ఒడిశా రాష్ట్రం పొట్టంగికి చెందిన డి.కృష్ణ సుందరి మృతి చెందారు. పోలీసుల వివరాల మేరకు.. ఒడిశా నుంచి సిమెంట్ లోడుతో సాలూరు వైపు వస్తున్న లారీ స్కూటీని ఢీ కొట్టి లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో స్కూటీపై వెళుతున్న ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. లారీ క్లీనర్‌కు గాయాలయ్యాయి. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News September 16, 2025
నల్గొండ: అంగన్వాడీ టీచర్ల పోరుబాట

సమస్యల సాధన కోసం అంగన్వాడీ టీచర్లు పోరుబాట పట్టారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సుమారు 4 వేలకు పైగానే అంగన్వాడి టీచర్లు ఉన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రూ.18 వేల వేతనంతో పాటు పీఎఫ్ అమలు చేయాలని కోరుతూ ఈనెల 25న చలో సెక్రటేరియట్‌కు పిలుపునిచ్చారు. అక్టోబర్ 8న రాష్ట్ర సమ్మెలో భాగంగా జిల్లా కేంద్రాల్లో పాదయాత్ర, 17 నుంచి ఆన్లైన్ సమ్మె నిర్వహించనున్నట్లు తెలిపారు.
News September 16, 2025
ఉమ్మడి కృష్ణాలో మిగిలిపోయిన 10 టీచర్ పోస్టులు

ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉపాధ్యాయ ఉద్యోగాలకు 1198 మందిని విద్యాశాఖ ఎంపిక చేసింది. ప్రభుత్వ, జడ్పీ, గిరిజన సంక్షేమ శాఖ, జువైనల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ల స్కూళ్లలో మొత్తంగా 1208 పోస్టులు నోటిఫై చేయగా.. వీటిలో 1198 పోస్టులకు మెరిట్ కమ్ రిజర్వేషన్ రోస్టర్ నిబంధనల మేరకు అభ్యర్థులను ఖరారు చేశారు. 10 పోస్టులకు అర్హులు లేకపోవడంతో వాటిని భర్తీ చేయలేదు. ఈ నెల 19న వీరికి నియామక ఉత్తర్వులు అందజేయనున్నారు.
News September 16, 2025
భారీగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగి రికార్డు స్థాయికి చేరాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.870 పెరిగి రూ.1,11,930కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10g గోల్డ్ రూ.800 ఎగబాకి రూ.1,02,600 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.1000 పెరిగి రూ.1,44,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.