News December 15, 2024

పాచిపెంట: పసర మందుకు చిన్నారి బలి

image

పసర మందు కారణంగా ఓ చిన్నారి బలైన ఘటన పాచిపెంట మండలం బొర్రమామిడి పంచాయతీ బొడ్డుపాడు గ్రామంలో వెలుగుచూసింది. పోయి మెరకమ్మ, లక్ష్మణరావు దంపతులకు ఆరు నెలల చిన్నారి మంజుల ఉంది. మంజుల కొన్ని రోజులుగా దగ్గు, గురక వ్యాధితో బాధపడుతుండగా తల్లిదండ్రులు పసరు వైద్యాన్ని చేయించారు. ఆ వైద్యం వికటించడంతో మంజుల మృతిచెందింది. గ్రామానికి చెందిన వైద్య సిబ్బందికి కూడా ఈ విషయం తెలియకపోవడం గమనార్హం.

Similar News

News February 5, 2025

ఈ నెల 8న కొత్తవలసకు మాజీ ఉపరాష్ట్రపతి

image

కొత్తవలస మండలంలోని చింతలపాలెంలో ఈ నెల 8న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటించనున్నారు. భీష్మ ఏకాదశి పర్వదినం పురష్కరించుకుని చిట్టిపాప తీర్ధ మహోత్సవం సందర్భంగా జరగనున్న సాహిత్యగోష్టికి వెంకయ్యనాయుడు హాజరవుతారని సర్పంచ్ సీతారామపాత్రుడు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకిస్తారని చెప్పారు.

News February 4, 2025

విశాఖలోని విజయనగరం వాసి ఆత్మహత్య

image

విశాఖలోని విజయనగరం వాసి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం జరిగింది. మృతుడు విజయనగరం జిల్లా తెర్లాం మండలం పనుకువలస గ్రామానికి చెందిన అలుగుబెల్లి గణేశ్ (43)గా పోలీసులు గుర్తించారు. విశాఖలో పెయింటర్‌గా పనిచేస్తున్న గణేశ్ మిథిలాపురిలోని ఉడాకాలనీలో 9 నెలలుగా ఉంటున్నాడు. కాగా మంగళవారం ఉదయం హాల్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని మృతిచెందినట్లు పీఎంపాలెం పోలీసులు తెలిపారు.

News February 4, 2025

విజయనగరం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నిక హీట్

image

జిల్లాలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక హీట్ పెరిగింది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు స్పీడ్‌ పెంచారు. వివిధ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తూ మద్దతు కోరుతున్నారు. కాగా జిల్లాలో మొత్తం 4,937 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉండగా వారిలో 3,100 మంది పురుష ఓటర్లు, 1,837 మంది మహిళ ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ నెల 27న పోలింగ్ జరగనుండగా, వచ్చే నెల 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

error: Content is protected !!