News February 17, 2026
పాఠశాలలలో తనిఖీలు నిర్వహించాలి: కలెక్టర్

స్వర్ణ వార్డుల పరిధిలో పాఠశాలల తనిఖీలను ప్రతి సోమ, గురువారాల్లో తప్పనిసరిగా నిర్వహించాలని కలెక్టర్ డా. వి.వినోద్ కుమార్ ఆదేశించారు. విద్యా నిర్వహణ, మౌలిక సదుపాయాలు, హాజరు, మధ్యాహ్న భోజన పథకంపై సమగ్ర పరిశీలన చేసి వివరాలను ఇంటిగ్రేటెడ్ మానిటరింగ్ యాప్‌లో అప్లోడ్ చేయాలని సూచించారు. సమీక్షలో డిఈవో శ్రీనివాస్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 26, 2026
కట్టకొక కంకి లేతైనా పుట్టికి ఏదుంతరుగు

పంట పండే సమయంలో ప్రతి మొక్కకు (కట్టకు) ఉండే కంకి గట్టిపడకుండా, పాలు పోసుకునే దశలో లేదా లేతగా ఉంటే, గింజ బరువు తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో పంటను అమ్మితే ఆశించిన బరువు రాకపోవడం వల్ల ఆదాయం తగ్గుతుంది. అంటే పంట కేవలం సంఖ్యలో (కంకులు) ఎక్కువగా ఉంటే సరిపోదు, గింజ ముదిరి గట్టిగా ఉంటేనే రైతుకు సరైన బరువు, తద్వారా లాభం వస్తుందని ఈ సామెత తెలియజేస్తుంది.
News February 26, 2026
గురువార వ్రతం: పఠించాల్సిన మంత్రాలు

వ్రత సమయంలో మనసును దైవచింతనలో ఉంచాలి. అందుకోసం కొన్ని మంత్రాలను సూచిస్తున్నారు పండితులు. వీటిని పఠిస్తే గురు గ్రహ అనుగ్రహం కలిగి, ప్రతికూల శక్తులు తొలగిపోతాయని అంటున్నారు.
* బృహస్పతి బీజ మంత్రం: “ఓం బృం బృహస్పతయే నమః”
* గురు గాయత్రీ మంత్రం: “ఓం వృషభధ్వజాయ విద్మహే ఘృణిహస్తాయ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్”
* మహావిష్ణువు శ్లోకం: “శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం…”
News February 26, 2026
కాజీపేటలో కల్తీ ఐస్ క్రీం స్వాధీనం

కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని విష్ణుపురిలో టాస్క్ ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో కల్తీ ఐస్‌క్రీంలతో పాటు గడువు తీరిన రూ.60,400 విలువలైన 12 రకాల ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు పాటించని షాపు యజమానిని అదుపులోకి తీసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ ACP మధుసూదన్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న సామాగ్రిని విచారణ నిమిత్తం ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగించారు.


