News March 5, 2025

పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. అల్లూరి జేసీ ఆరా..!

image

తురకలవలస బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌ ఘటనపై జేసీ, ఇన్ ఛార్జ్ ఐటీడీఏ పీవో డాక్టర్ ఎం.జే అభిషేక్ గౌడ ఆరా తీశారు. ఆశ్రమ పాఠశాలను మంగళవారం సందర్శించి విద్యార్థినులతో మాట్లాడారు. వారి ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్టాక్ రూమ్, వంట గదిని పరిశీలించి ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు. నాణ్యమైన విద్యతోపాటు మెనూ ప్రకారం మంచి ఆహారం అందించాలని ఆదేశించారు.

Similar News

News March 6, 2025

సీఎం ప్రచారం చేసినా దక్కని విజయం!

image

TG: KNR-MDK-NZB-ADB ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోవడం ఆ పార్టీకి బిగ్ షాక్ అని చెప్పవచ్చు. పార్టీ అధికారంలో ఉన్నా, సీఎం రేవంత్ ప్రచారం నిర్వహించినా సిట్టింగ్ స్థానంలో గెలవకపోవడంతో ఈ జిల్లాల్లో కాంగ్రెస్ హవా తగ్గిందా అనే చర్చ మొదలైంది. ఈ ఎన్నికలో గెలిచినా, ఓడినా తమకు పోయేదేం లేదని స్వయంగా రేవంత్ వ్యాఖ్యానించడమూ ఆ పార్టీ ఓటమికి కారణమైందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

News March 6, 2025

గుంటూరు: గుడారాల పండుగకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు

image

గుంటూరు గుడారాల పండుగను దృష్టిలో పెట్టుకొని ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు గుంటూరు డివిజన్ అధికారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాల్లోకి వెళితే ఈనెల 6 నుంచి ప్రారంభమయ్యే గుడారాల పండుగకు ఈనెల 5వ తేదీన ప్రత్యేక రైళ్లు గుంతకల్, రేణిగుంట, విశాఖపట్నం, సికింద్రాబాద్ నుంచి గుంటూరుకు చేరుకుంటాయి. తిరిగి 9న బయలు దేరుతుయని రైల్వే అధికారులు తెలిపారు.

News March 5, 2025

అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

అల్లూరి: ఇంటర్ పరీక్షలకు 209 మంది గైర్హాజరు
>గురుకులంలో 400 సీట్లకు అప్లై చేసుకోండి: రంపచోడవరం పీవో
> ఈనెల కూడా పప్పు, పంచదార లేదు
>అల్లూరి సిగలో మరో జలపాతం
>పాడేరు: సివిల్స్ ఉచిత శిక్షణకు ధరఖాస్తుల ఆహ్వానం
>గంగవరం: సాగునీటి కోసం అన్నదాతల అవస్థలు
>అరకు: సెల్ఫ్ డిఫెన్స్ పై విద్యార్థులకు శిక్షణ
>కొత్తపుట్టు జంక్షన్ వద్ద 70 కిలోల గంజాయి స్వాధీనం

error: Content is protected !!