News February 26, 2026
పాడి పశువులను అలా కట్టేసే ఉంచుతున్నారా?

చాలా మంది పాడి రైతులు పశువులను రోజంతా అలా కట్టేసి ఉంచుతారు. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని చెబుతున్నారు వెటర్నరీ నిపుణులు. దీని వల్ల వాటికి గాయాలు కావడంతో పాటు మానసిక ఒత్తిడికి గురవడంతో పాటు క్రమంగా దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు పెరుగుతుందని అంటున్నారు. వాటిని కచ్చితంగా ఉదయం, సాయంత్రం కాసేపు నడిపించాలని సలహా ఇస్తున్నారు. వాటి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, పశువులకు రోజూ స్నానం చేయించాలని సూచిస్తున్నారు.
Similar News
News February 27, 2026
సెమీస్‌పై కివీస్ కన్ను

T20 WCలో ఇవాళ సా.7 గంటలకు ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. గ్రూప్-2 నుంచి ENG ఇప్పటికే సెమీస్ చేరగా రెండో బెర్త్ ఖాయం చేసుకోవాలని శాంట్నర్ టీమ్ ఉవ్విళ్లూరుతోంది. ఈ మ్యాచ్ గెలిస్తే కివీస్ నేరుగా సెమీస్‌లో అడుగుపెడుతుంది. ఓడితే రేపటి శ్రీలంక-పాక్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది. లంకపై పాక్ భారీ తేడాతో గెలిస్తే కివీస్ సెమీస్ ఆశలు క్లిష్టమవుతాయి.
News February 27, 2026
రైల్వే టికెట్‌ను వేరొకరి పేరు మీదకు మార్చొచ్చు!

కన్ఫర్మ్ అయిన రైలు టికెట్‌పై ప్రయాణించే వ్యక్తి పేరును మార్చుకునే వెసులుబాటును రైల్వే కల్పిస్తోంది. మీ టికెట్‌ను మీ నాన్న, అమ్మ, బ్రదర్, సిస్టర్, కొడుకు, కూతురు లేదా భార్యాభర్తల పేరు మీదకు మార్చుకోవచ్చు. దీనికోసం ప్రయాణానికి 24 గంటల ముందే టికెట్, ID ప్రూఫ్‌తో రిజర్వేషన్ ఆఫీసర్‌ను కలవాలి. ప్రభుత్వ ఉద్యోగులు, స్టూడెంట్స్, పెళ్లి బృందాలకు కూడా ఈ ఛాన్స్ ఉంది. ఈ మార్పు ఒక్కసారి మాత్రమే కుదురుతుంది.
News February 27, 2026
అధిక యూరియాతో పంటకు కలిగే నష్టాలు

చాలా మంది రైతులు ఎక్కువ దిగుబడి వస్తుందని పంటకు అధికంగా యూరియా వేస్తున్నారు. సిఫార్సుకు మించి వేసిన యూరియా ఒకేసారి నీటిలో కరిగిపోతుంది. 2-3 రోజుల్లో పంట కొంత వరకు మాత్రమే తీసుకోగలుగుతుంది. మిగిలింది వృథాగా భూమి లోపలి పొరల్లోకి, ఆవిరి రూపంలో గాలిలో కలిసిపోతుంది. దీని వల్ల ఎరువు నష్టంతో పాటు పంటను ఎక్కువగా పురుగులు, తెగుళ్లు ఆశించి బలహీన పరుస్తాయి. కాబట్టి నిపుణుల సిఫార్సు మేరకే యూరియా వేసుకోవాలి.


