News January 1, 2026
పాడేరులో జిల్లా స్థాయి నూతన సంవత్సరం వేడుకలు

అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆధ్వర్యంలో నూతన సంవత్సరం–2026 వేడుకలు నేడు పాడేరులో నిర్వహించనున్నారు. ఉదయం 7.30 నుంచి 10.30 గంటల వరకు జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. (మనివా గ్రిల్స్ రెస్టారెంట్ ఎదురుగా) వేడుకలకు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆహ్వానితులు హాజరుకావాలని జిల్లా యంత్రాంగం కోరింది.
Similar News
News January 10, 2026
ఈనెల 13న హనుమకొండలో ఉద్యోగ మేళా

ఉమ్మడి జిల్లా నిరుద్యోగ యువత ఉపాధి కల్పన కోసం ఈనెల 13న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పనా శాఖ అధికారి బి.సాత్విక తెలిపారు. సుమారు 75 ప్రైవేట్ ఉద్యోగాల కోసం టెన్త్, ఇంటర్, డిగ్రీ ఆపై చదివిన 21 నుంచి 45 ఏళ్ల యువత అర్హులని అన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు అర్హత ధృవపత్రాలతో ములుగు రోడ్డు వద్ద గల తమ కార్యాలయంలో జరుగే మేళాకు హాజరు కావాలన్నారు.
News January 10, 2026
సూర్యాపేట: రైతు ఇంట్లో ప్రేమ పక్షుల ముచ్చట!

మనుషుల మధ్య ప్రేమ, ఆప్యాయతలు కనుమరుగవుతున్న తరుణంలో.. పక్షుల మధ్య అపారమైన అనురాగం చూపరులను ఆకట్టుకుంది. సూర్యాపేట జిల్లా ముక్కుడుదేవులపల్లిలో రైతు మల్లేష్ ఇంట్లోని చెట్టుపై శనివారం సాయంత్రం పక్షులు ప్రేమగా ముద్దు పెట్టుకుంటున్న అరుదైన దృశ్యం కనిపించింది. ఈ అద్భుత దృశ్యాన్ని చూసి గ్రామస్థులు మంత్రముగ్ధులయ్యారు. ప్రకృతిలోని ఈ అందమైన అనుబంధాన్ని పలువురు తమ చరవాణిల్లో ఆసక్తిగా చిత్రీకరించారు.
News January 10, 2026
స్లీపర్ బస్సులపై కేంద్రం కఠిన నిబంధనలు

దేశంలో స్లీపర్ బస్సుల ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం నిబంధనలను కఠినతరం చేసింది. గత 6 నెలల్లో జరిగిన ప్రమాదాల్లో 145 మంది మృతి చెందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇకపై స్లీపర్ బస్సులను ఆటోమొబైల్ కంపెనీలు లేదా కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన తయారీదారులే నిర్మించాల్సి ఉంటుందన్నారు. బస్సుల్లో అన్ని రకాల భద్రతా పరికరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.


