News July 4, 2025

పాడేరులో మన్యం వీరుడి జయంతి ఉత్సవాలు

image

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి శుక్రవారం పాడేరు కలెక్టరేట్‌లో ఘనంగా జరగింది. కలెక్టర్ దినేశ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, చిత్ర ప్రదర్శన ప్రజలను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ శర్మన్ పటేల్, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Similar News

News July 4, 2025

వనపర్తి: ‘గురుకుల విద్యార్థులకు అన్ని వసతులు కల్పించండి’

image

ప్రభుత్వ గురుకులాల్లో చదివే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం ఆయన వనపర్తిలోని కేడీఆర్ నగర్‌లో ఉన్న తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాలను, జగత్పల్లిలో ఉన్న తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్, నాగవరంలో ఉన్న మహాత్మా జ్యోతిబా ఫులే స్కూళ్లను తనిఖీ చేశారు.

News July 4, 2025

ఈ స్కిల్స్ పెంచుకుంటే విజయం మీదే!

image

ఏ రంగంలోనైనా సక్సెస్ పొందేందుకు అవసరమైన నైపుణ్యాలను పెంచుకుంటే విజయం మీ సొంతం అవుతుందని పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా చెప్పారు. ‘ప్రతి ఒక్కరూ తమ సంస్థాగత నైపుణ్యాలు, డెసిషన్ మేకింగ్ & ఎమోషనల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్, సెల్ఫ్ మేనేజ్మెంట్ & నాయకత్వ నైపుణ్యాలు, కమ్యూనికేషన్ & క్రిటికల్ థింకింగ్ స్కిల్స్, పరిశోధన- విశ్లేషణ స్కిల్స్, టీమ్ వర్క్ స్కిల్స్, రైటింగ్స్ నైపుణ్యాలను పెంచుకోవాలి’ అని తెలిపారు.

News July 4, 2025

ఇబ్రహీంపట్నం: ‘నేరాల నివారణే లక్ష్యంగా పనిచేయండి’

image

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీకి పలువురు అధికారులు పుష్ప గుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను, పోలీస్ స్టేషన్ లోని పరిసరాలను, నేరాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు కార్యక్రమంలో మెట్‌పల్లి డీఎస్పీ రాములు, సీఐ అనిల్ కుమార్, ఎస్సై అనిల్ తదితరులు పాల్గొన్నారు.