News April 16, 2024
పాడేరు: ఈనెల 20వ తేదీన ప్రవేశ పరీక్ష

2024-25 విద్యా సంవత్సరానికి గాను ఏకలవ్య మోడల్ పాఠశాలల్లో ప్రవేశాలకు ధరఖాస్తులు చేసుకున్న విద్యార్థులకు ఈనెల 20వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని ఐటీడీఏ పీవో వీ.అభిషేక్ తెలిపారు. అరకు, పాడేరు, చింతపల్లి, విశాఖపట్నంలో 14 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఆయా పరీక్షా కేంద్రాల్లో ప్రవేశాలకు ధరఖాస్తు చేసుకున్న 4,733 విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని చెప్పారు.
Similar News
News October 8, 2025
ఎల్ఆర్ఎస్ పథకం కోసం VMRDA గ్రౌండ్ ఫ్లోర్లో హెల్ప్ డెస్క్

ఎల్ఆర్ఎస్ పథకం కోసం VMRDA గ్రౌండ్ ఫ్లోర్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. ఈనెల 31 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ ఏడాది జూన్ 30 లోపు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఈ పథకం కింద తమ స్థలాలను క్రమబద్ధీకరించుకోవచ్చని అన్నారు. దీనివల్ల భవన నిర్మాణ అనుమతులు, బ్యాంకు రుణాలు పొందవచ్చని పేర్కొన్నారు.
News October 7, 2025
‘ఉపాధి హామీ వేతనదారులు ఈ-కేవైసీ చేయించుకోవాలి’

ఉపాధి హామీ పథకం వేతనదారులకు ఈ-కేవైసీ చేస్తున్నామని డ్వామా పీడీ పూర్ణిమాదేవి తెలిపారు. NMMS యాప్‌లో ముఖ ఆధారిత హాజరు నమోదుకు దీన్ని చేపట్టామన్నారు. ఉపాధి హామీ పథకంలో ఒకరికి బదులు మరొకరు పనికి రాకుండా ముఖ ఆధారిత హాజరు పద్ధతి ప్రారంభం కానుందని అన్నారు. జిల్లాలో 47,725 మందికి ఈ-కేవైసీ జరుగుతుందన్నారు. ఆధార్ కార్డు, జాబ్ కార్డులతో క్షేత్ర సహాయకుడిని సంప్రదించాలని కోరారు.
News October 7, 2025
సుజాతనగర్ జంక్షన్‌లో యాక్సిడెంట్.. మహిళ మృతి

పెందుర్తిలోని సుజాతనగర్ జంక్షన్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న మహిళను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పెందుర్తి ట్రాఫిక్ సీఐ సురేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.