News September 27, 2024

పాడేరు: ఈనెల 27న మీకోసం కార్యక్రమం రద్దు

image

ఈనెల 27వ తేదీ శుక్రవారం జరగనున్న మీకోసం కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు పాడేరు ఐటీడీఏ పీవో వి.అభిషేక్ తెలిపారు. శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో, ఫిర్యాదుదారులకు ఎటువంటి సమస్య లేకుండా ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు పీఓ ప్రకటించారు. ఫిర్యాదుదారులు గమనించి నీకోసం కార్యక్రమంలో ఫిర్యాదులు అందజేయడానికి రావద్దని పిఓ విజ్ఞప్తి చేశారు.

Similar News

News December 30, 2024

విశాఖ: తొలి రోజు 233 మంది హాజరు

image

పోలీసు నియామక ప్రక్రియలో భాగంగా ఉమ్మడి విశాఖ అభ్యర్థులకు సోమవారం నుంచి శారీరక దారుఢ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు కైలాసగిరి పోలీస్ మైదానంలో ఫిబ్రవరి 1 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. తొలి రోజు 600 మంది హాజరు కావాల్సి ఉండగా 233 మంది మాత్రమే బయోమెట్రిక్‌కు హాజరయ్యారు. పరీక్షల నిర్వహణ తీరును డీఐజీ గోపీనాథ్ రెడ్డి, ఎస్పీ తూహిన్ సిన్హా పరిశీలించారు.

News December 30, 2024

పాడేరు మెడికల్ కాలేజీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో పోస్టులు భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ హేమలతాదేవి తెలిపారు. పారామెడికల్, సపోర్టింగ్ స్టాఫ్ విభాగంలో 29 క్యాటగిరీలలో మొత్తం 244 పోస్టులు భర్తీ చేస్తామన్నారు. అభ్యర్థులు ఈనెల 31నుంచి జనవరి 10లోగా ప్రభుత్వ వైద్య కళాశాలలో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. >Share it

News December 30, 2024

హుకుంపేట: దూలానికి బోర్డు.. రెండు రేకులే పాఠశాల పైకప్పు

image

అల్లూరి జిల్లా హుకుంపేట(M) ఎగరూడి గ్రామంలో పాఠశాల భవనం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు వాపోయారు. నిధులు మంజూరయినప్పటికీ పాఠశాల నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయినట్లు తెలిపారు. దీంతో రేకుల షెడ్డులో బోధనలు సాగుతున్నాయని చెప్పారు. ఎండ, చలి, విష సర్పాల నుంచి రక్షణ లేకుండా పోయిందని, పిల్లలు భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.