News November 29, 2025
పాడేరు: ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూమ్‌లో భద్రపరిచి ఉన్న ఈవీఎం గోదాములను, వివిధ ప్రధాన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి కలెక్టర్ దినేశ్ కుమార్ శనివారం తనిఖీ చేశారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా ఈవీఎం గోదాములను సందర్శించిన ఆయన, అక్కడ పరిస్థితులను గమనించారు. సీసీ కెమెరాల పనితీరును, ప్రధాన ద్వారానికి ఉన్న సీళ్లను పరిశీలించారు. భద్రతా ప్రమాణాలపై అక్కడ అధికారులకు, పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు.
Similar News
News December 6, 2025
MNCL: ఈనెల 21న జాతీయ లోక్ అదాలత్

ఈనెల 21న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీరయ్య తెలిపారు. శనివారం మంచిర్యాల జిల్లా కోర్టులో పోలీసు ఉన్నతాధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో మాట్లాడుతూ.. లోక్ అదాలత్‌లో మోటర్ వాహన నష్టపరిహారం, NI యాక్ట్, క్రిమినల్ కేసులు, సివిల్ దావాలు పరిష్కరించుకోవచ్చన్నారు. వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా కృషి చేయాలని సూచించారు.
News December 6, 2025
మీ పిల్లలు చేసే ఈ పనులను సరిదిద్దండి

పిల్లలు చేసే కొన్ని పనులు మనకు నవ్వు తెప్పిస్తాయి. కానీ అవే భవిష్యత్‌లో సమస్యలుగా మారే ప్రమాదముంది. పెద్దలు మాట్లాడేటప్పుడు అడ్డుకోవడం, ఏదైనా షేర్ చేసుకోకుండా మొండిగా ఉండటం, అబద్ధాలు చెప్పడం, దుకాణాల్లో మారాం చేయడం.. ఇవన్నీ చిన్న వయసులోనే మార్చాల్సిన అలవాట్లు. ఎక్కువ సమయం ఫోన్ చూడటం, మాట వినకపోవడం వంటి ప్రవర్తనలు కూడా వ్యక్తిత్వంపై ప్రభావం చూపుతాయి. మృదువైన హెచ్చరికతో పిల్లలను సరిదిద్దాలి.
News December 6, 2025
విశాఖ: రైతు బజార్లలో స్టాల్స్ ఏర్పాట్లకు దరఖాస్తుల ఆహ్వానం

విశాఖలో 12 రైతు బజార్లలో స్టాల్స్ ఏర్పాటు చేసుకునేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ శనివారం తెలిపారు. డిసెంబర్ 31వ తేదీ నుంచి ఖాళీ అవుతున్న 25 డ్వాక్రా మహిళలు, ఆరు PHC స్టాల్స్‌కు డిసెంబర్ 7 నుంచి 17వ తేదీ వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తులను గోపాలపట్నం మార్కెటింగ్ శాఖ కార్యాలయంలో అందజేయాలి.


