News October 14, 2025
పాడేరు: ‘ఈ పోస్టులకు 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోండి’

పాడేరు సమగ్ర శిక్ష కార్యాలయం, ఇంజినీరింగ్ విభాగంలో తాత్కాలిక పద్ధతిలో పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థులు ధరఖాస్తు చేసుకోవాలని సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు సోమవారం తెలిపారు. పాడేరు, రంపచోడవరం, చింతూరు డివిజన్లలో పని చేసేందుకు సైట్ ఇంజినీర్ పోస్టులు-6, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు-2 ఖాళీగా ఉన్నాయన్నారు. బీటెక్, బీఎస్సీ, బీకాం చేసిన అభ్యర్థులు అక్టోబర్ 20లోగా దరఖాస్తులు కార్యాలయంలో అందించాలన్నారు.
Similar News
News October 14, 2025
బల్కంపేట ఎల్లమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు

HYD బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వేకువజామునే ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు అమ్మవారి మూలమూర్తికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం వివిధ పుష్పాలు, పట్టు చీరతో అలంకరించి, పంచ హారతులు, కుంకుమార్చన వంటి ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.

ఖమ్మం: ఈ గ్రామాలకు రూ.కోటి

పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద మోడల్ సోలార్ విలేజ్‌లకు కేంద్రం ప్రోత్సాహకాలను అందజేస్తోంది. ఈ పథకాన్ని ఖమ్మంలో ఏప్రిల్ 4 నుంచి OCT3, భద్రాద్రిలో ఏప్రిల్ 9 నుంచి OCT 8వరకు అమలు చేశారు. ఉమ్మడి జిల్లాలో 22 గ్రామాలు ఎంపికయ్యాయి. ఖమ్మం జిల్లా నుంచి కొణిజర్ల, కొత్తగూడెం నుంచి భద్రాచలం విజేతలుగా నిలిచాయి. ఈ గ్రామాలకు ఇచ్చే రూ.కోటి నిధులను ప్రజా ప్రయోజనాలకు వినియోగించాలని నిర్దేశించారు.