News March 11, 2025
పాడేరు: ‘గ్రామ రెవెన్యూ అధికారి క్షేత్ర సందర్శన తప్పనిసరి’

గ్రామ రెవెన్యూ అధికారి క్షేత్ర సందర్శన తప్పనిసరిగా చేయాలని కలెక్టర్ దినేశ్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సబ్ కల్లెక్టర్స్, 22 మండలాల ఎమ్మార్వోలు, వీఆర్వోలు, గ్రామ, మండల సర్వేయర్లతో మంగళవారం రెవిన్యూ అధికారుల వారాంతపు సమావేశం నిర్వహించారు. ఐవీఆర్ఎస్‌లో వచ్చిన నివేదికలో గ్రామ రెవిన్యూ అధికారి క్షేత్ర సందర్శనలు చేయటం లేదని పేర్కొన్నారు. ఎమ్మార్వోలు బాధ్యత వహించి, చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Similar News
News March 12, 2025
సాయంకాలం వాకింగ్ చేస్తున్నారా?

వేసవికాలంలో సాయంకాలం వాకింగ్ చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీంతో రాత్రి పూట నిద్ర బాగా పడుతుందని అంటున్నారు. ప్రతి రోజూ అరగంట నడిస్తే మెదడు ఉత్సాహంగా పనిచేయడమే కాకుండా రక్తపోటు సమస్య రాదు. సాయంకాలపు నడకతో శరీరంలోని కండరాలు బలపడటమే కాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రాత్రి భోజనం తర్వాత కాసేపు నడవాలని సూచిస్తున్నారు.
News March 12, 2025
కృష్ణా ఎక్స్‌ప్రెస్ ప్రయాణించే రూట్‌లో మార్పులు

విజయవాడ, కొండపల్లి మీదుగా తిరుపతి(TPTY)- ఆదిలాబాద్(ADB) మధ్య ప్రయాణించే కృష్ణా ఎక్స్‌ప్రెస్ ప్రయాణించే రూట్‌లో రైల్వే శాఖ మార్పులు చేసింది. సికింద్రాబాద్ స్టేషన్‌లో అభివృద్ధి పనులు చేస్తున్నందున నం.17405 TPTY- ADB రైలు ఈ నెల 26, నం.17406 ADB- TPTY రైలు ఈ నెల 27 నుంచి ఆ స్టేషన్లలో ఆగదని రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైళ్లను పై తేదీల నుంచి చర్లపల్లి మీదుగా నడుపుతున్నామన్నారు.
News March 12, 2025
NRPT: తెలంగాణ బడ్జెట్.. జిల్లాకు ఏమి కావాలంటే.?

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయాయి. ఈ నేపథ్యంలో NRPT జిల్లాకు పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. 69జీవోను పాత డీపీఆర్ ప్రకారం రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని కోరుతున్నారు. జిల్లాలో ఐటీ హబ్ ఏర్పాటు, రోడ్ల మరమ్మత్తులకు నిధులు, జూనియర్ కళాశాల ఏర్పాటుకు నిధులు, వాగులపై చెక్ డ్యాముల నిర్మాణం, కొత్తగా బస్టాండ్ నిర్మించాలని కోరుతున్నారు.