News July 9, 2025

పాడేరు: ‘టీచర్లే లేని పాఠశాలలకు మెగా పీటీఎం అవసరమా?’

image

అల్లూరి జిల్లా వ్యాప్తంగా గల 11 మండలాల పరిధిలో వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునః ప్రారంభమై నేటి వరకు ఉపాధ్యాయులు లేని పాఠశాలల్లో మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ ఎలా నిర్వహిస్తారని గిరిజన విద్యార్థి సంఘం నాయకులు మాధవ్, బాబూజీ, కిషోర్ ప్రశ్నించారు. బుధవారం పాడేరులో వారు మాట్లాడారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించి గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పడాలని డిమాండ్ చేశారు.

Similar News

News July 10, 2025

బ్యాటరీ సైకిల్ రూపొందించిన విద్యార్థికి పవన్ అభినందనలు

image

AP: బ్యాటరీ సైకిల్ రూపొందించిన విజయనగరం ఇంటర్మీడియట్ విద్యార్థి రాజాపు సిద్ధూను Dy.CM పవన్ కళ్యాణ్ అభినందించారు. SM ద్వారా అతడి ఆవిష్కరణ గురించి తెలుసుకుని మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి ఆహ్వానించారు. అతడిని బ్యాటరీ సైకిల్‌పై ఎక్కించుకుని ఆయన స్వయంగా నడిపారు. భవిష్యత్తులో సరికొత్త ఆలోచనలు చేయాలని ఆకాంక్షిస్తూ ప్రోత్సాహకంగా రూ.లక్ష అందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను Dy.CMO రిలీజ్ చేసింది.

News July 10, 2025

నేరాల నియంత్రణకు ప్రత్యేక నిఘా పెట్టాలి: SP

image

నేరాల నియంత్రణకు నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులపై ప్రత్యేకంగా నిఘా పెట్టాలని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. బుధవారం విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో మాసాంతర సమీక్ష నిర్వహించారు. ప్రజలకు శక్తి యాప్‌పై అవగాహన చేపట్టాలన్నారు. విద్యార్థులకు సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్పించేందుకు శక్తి వారియర్స్ టీమ్స్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలన్నారు.

News July 10, 2025

విశాఖలో గ్లోబల్ క్యాబబులిటీ సెంటర్ ఏర్పాటు

image

విశాఖ కేంద్రంగా ప్రముఖ ఔషధ తయారీ సంస్థ ఇసాయ్ ఫార్మా గ్లోబల్ క్యాబబులిటీ సెంటర్ (GCC) ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు బుధవారం విశాఖలోని ఐటీ మౌలిక సదుపాయాలను సంస్థ నిపుణుల బృందం పరిశీలించింది. విశాఖ ఎంపీ శ్రీభరత్‌కు తమ ప్రణాళికలను ఇసాయ్ ఫార్మా గ్లోబల్ CEO మెుకోటో హోకేట్సు వివరించారు.