News April 12, 2025
పాడేరు: త్రైమాసిక జాబ్ మేళా క్యాలెండర్ ఆవిష్కరించిన కలెక్టర్

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి త్రైమాసిక జాబ్ మేళా క్యాలెండర్‌ను కలెక్టర్ దినేశ్ కుమార్ పాడేరు ఐటీడీఏలో శుక్రవారం ఆవిష్కరించారు. ఈనెల 17వ తేదీన అరకులోయ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో జాబ్ మేళా జరుగుతుందని, మే 2వ తేదీన పాడేరులో, అదేవిధంగా జూన్ 6వ తేదీన రంపచోడవరంలో ఈ మెగా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
Similar News
News July 4, 2025
కామారెడ్డి జిల్లాలో చేపల వేటపై నిషేధం

కామారెడ్డి జిల్లాలోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు జిల్లా మత్స్య శాఖ అధికారి శ్రీపతి శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేశారు. సంఘాల పరిధిలోని 100 ఎకరాల ఆయకట్టు పైన, లోబడి ఉన్న చెరువులు ఎవరికీ కౌలుకు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ఈ నిబంధనలు అతిక్రమించిన సంఘాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. జులై, ఆగస్టు నెలల్లో జిల్లాలోని అన్ని చెరువులు, రిజర్వాయర్, కుంటలలో చేపల వేటను నిషేధించామన్నారు.
News July 4, 2025
శ్రీ సత్యసాయి: పడిపోయిన వెల్లుల్లి ధరలు

ఈ ఏడాది ఆరంభం నుంచి వెల్లుల్లి ధరలు ఆకాశాన్నంటాయి. రెండు వారాలుగా ధరలు తగ్గుముఖం పట్టాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కిలో రూ.400 వరకు పలికిన వెల్లుల్లి ప్రస్తుతం రూ.80 నుంచి రూ.100 పలుకుతోందని వ్యాపారులు తెలిపారు. దీంతో ప్రస్తుతం వెల్లుల్లి సాగు చేసిన రైతులు డీలపడ్డారు. ధరలు పెరగడం వల్ల ప్రజలు, ఉన్నఫలంగా ధర అట్టడుగు స్థాయికి పడిపోవడంతో రైతులు నష్టపోతున్నారన్నారు.
News May 8, 2025
శ్రేయస్ ఖాతాలో అరుదైన రికార్డు

ఐపీఎల్‌లో శ్రేయస్ అయ్యర్ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నారు. కనీసం 50 మ్యాచుల్లో నాయకత్వం వహించి అత్యధిక విజయశాతం కలిగిఉన్న కెప్టెన్‌గా నిలిచారు. శ్రేయస్ అయ్యర్ విజయశాతం 59.4% ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో హార్దిక్(58.9%), సచిన్(58.8%), ధోనీ(58.4) ఉన్నారు.