News August 23, 2025
పాడేరు పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల 25న జాబ్ మేళా

రాష్ట్ర నైపుణ్యభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 25వ తేదీన పాడేరు పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారిణి డాక్టర్ రోహిణి శుక్రవారం తెలిపారు. అపోలో ఫార్మసీ, నవత రోడ్డు ట్రాన్స్ పోర్ట్ తదితర కంపెనీల ప్రతినిధులు పాల్గొని నిరుద్యోగ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. ఇంటర్, డిగ్రీ, బీటెక్ ఆపై చదువులు పూర్తిచేసిన నిరుద్యోగ అభ్యర్థులు హాజరు కావాలన్నారు.
Similar News
News August 23, 2025
PDPL: ‘జిల్లాసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్యసేవలు’

PDPL జిల్లా ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని సూపరింటెండెంట్ డా.శ్రీధర్ తెలిపారు. బెడ్స్ నిండినా ఎవరినీ వెనక్కి పంపకుండా ఫోల్డింగ్ మంచాలపై చికిత్స అందిస్తున్నామన్నారు. అవసరమైన మందులందిస్తున్నామని, రక్తపరీక్షలు ఆసుపత్రిలోనే చేస్తున్నామన్నారు. 100పడకల కొత్తాసుపత్రి పూర్తైతే స్థల సమస్య తగ్గుతుందని, సిబ్బంది తమ సామర్థ్యానికి మించి సేవలందిస్తున్నారని అన్నారు. ప్రజలు సహకరించాలన్నారు.
News August 23, 2025
HYD రావాలని OpenAIకి KTR విజ్ఞప్తి

ఇండియాలో ఆఫీస్ ఓపెన్ చేస్తామని ప్రకటించిన ప్రముఖ AI సంస్థ OpenAIని HYDకు రావాలని మాజీ మంత్రి KTR కోరారు. ‘హైదరాబాద్ అనువైన ప్రాంతం. ఇక్కడ THub, WEHub, TWorks, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ సహా ఎన్నో ఉన్నాయి. MNCలు మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, మెటా, ఆపిల్, క్వాల్కమ్‌కు కేంద్రంగా ఉంది. AI విప్లవానికి శక్తినిచ్చే ప్రతిభ, ఆవిష్కరణలు, గ్లోబల్ కనెక్టివిటీని HYD తీసుకొస్తుంది’ అని Xలో పోస్ట్ చేశారు.
News August 23, 2025
HYD: పీజీ కోర్సుల కౌన్సెలింగ్ షెడ్యుల్ విడుదల

ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు మొదటి విడత ఆన్‌లైన్ కౌన్సెలింగ్ షెడ్యుల్‌ను విడుదల చేశారు. MSc బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఫార్మషుటికల్ కెమిస్ట్రీ, ఎంఏ ఎకనామిక్స్ ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశానికి సీపీగేట్- 2025 అర్హత సాధించిన అభ్యర్థులు ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని కన్వినర్ ప్రొ.పాండురంగారెడ్డి తెలిపారు. వివరాలకు ఉస్మానియా వెబ్‌సైట్‌లో చూడాలన్నారు.