News October 7, 2025
పాడేరు: ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి

స్వచ్ఛ భారత్ మిషన్ స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం పరిశుభ్రతను ప్రోత్సహించడానికి స్వచ్ఛాంధ్ర అవార్డులు ప్రకటించినట్లు కలెక్టర్ దినేశ్ కుమార్ అన్నారు. సోమవారం పాడేరులో స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రధాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతీ ఒక్కరికి పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచడమే లక్ష్యంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పనిచేయాలన్నారు. స్వచ్ఛత లక్ష్యాలను సాధించడంలో ప్రజల భాగస్వామ్యం ప్రోత్సహించాలన్నారు.
Similar News
News October 7, 2025
ADB: బయటకు ఒకటి.. లోపల ఇంకోటి

స్థానిక సంస్థల ఎన్నికలకు అభ్యర్థులు భిన్న రీతిలో తమదైన ప్రచారం చేసుకుంటున్నారు. పార్టీ నుంచి తమకే టికెట్ వస్తుందని ఆశిస్తూ ఇప్పటి నుంచే ఓటర్లను కాకా పడుతున్నారు. బయటకు మాత్రం పార్టీ నిర్ణయించిన అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. నిత్యం ఏదో ఒక ఊరికి వెళ్లి మద్దతును కూడగడుతూ తమకే ఎక్కువ బలం ఉందని అధిష్టానం వద్ద నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
News October 7, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News October 7, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 07, మంగళవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.55 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.07 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.21 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.00 గంటలకు
✒ ఇష: రాత్రి 7.12 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.