News July 7, 2025

పాడేరు: ప్రతీ విద్యార్ధి తల్లి పేరున మొక్కలు నాటాలి

image

ప్రభుత్వం విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ నుంచి అధికారులతో వీసీ నిర్వహించారు. ఈనెల 10న నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ మీట్‌ను అన్ని యాజమాన్యాల విద్యా సంస్థల్లో విజయవంతంగా నిర్వహించాలన్నారు. ప్రతీ విద్యార్థి తల్లి పేరున మొక్కలు నాటాలన్నారు. పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని చెప్పారు.

Similar News

News July 7, 2025

బాపట్ల పీజీఆర్ఎస్‌లో 55 అర్జీల: ఎస్పీ

image

బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఎస్పీ తుషార్ డూడి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 55 అర్జీలు అందినట్లు తెలిపారు. ఫిర్యాదులను చట్టపరిధిలో వేగంగా పరిష్కరించాలన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రజలు స్వయంగా వచ్చి తమ సమస్యలను అర్జీల రూపంలో అందించవచ్చని సూచించారు.

News July 7, 2025

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

☞ పామర్రులో దొంగల ముఠాను అరెస్ట్
☞కృష్ణా: అస్వస్థతకు గురైన వల్లభనేని వంశీ
☞ మచిలీపట్నం: స్పందనలో అర్జీలు స్వీకరించిన అధికారులు
☞ ఆత్కూర్ స్వర్ణభారత్ ట్రస్ట్‌ను సందర్శించిన కలెక్టర్, ఎస్పీ
☞నూజివీడు: IIITలో 141 సీట్లు ఖాళీ
☞ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద ఆందోళన

News July 7, 2025

కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ఉత్పత్తుల ధరలు

image

కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో సోమవారం పలు ఉత్పత్తుల ధరలు కింది విధంగా ఉన్నాయి. ✓ ధాన్యం(RNR): గరిష్ఠం: 2459. కనిష్ఠం: 2129, ✓ మక్కలు: గరిష్ఠం: 2200. కనిష్ఠం: 2200, ✓ పత్తి: గరిష్ఠం:7421. కనిష్ఠం: 3899, ✓ పసుపు(కాడి): గరిష్ఠం: 10,852. కనిష్ఠం: 3809, ✓ పసుపు(గోల): గరిష్ఠం: 10,559. కనిష్ఠం: 5298.