News September 12, 2025

పాడేరు: ‘మధ్యాహ్నం 3:30 గంటల వరకే ఈ సేవలు’

image

పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో ఇవాళ ఆరోగ్య శిబిరం నిర్వహించనున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ శుక్రవారం ఓ ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం జరగనుంది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన చెప్పారు.

Similar News

News September 12, 2025

సంతానం పొందడానికి SMEP..

image

ప్రస్తుత కాలంలో చాలా జంటలు సంతాన సమస్యలు ఎదుర్కొంటున్నాయి. అయితే పిల్లలు పుట్టకపోవడానికి లోపాలే కారణం అనుకుంటారు. కానీ అండం విడుదల సమయాన్ని గుర్తించలేకపోవడం కూడా ఒక కారణం. ఓవులేషన్ టెస్ట్ చేసుకొని దాన్ని బట్టి కలయికలో పాల్గొంటే సక్సెస్‌ రేటు పెరుగుతుందంటున్నారు నిపుణులు. దీన్నే స్పెర్మ్‌ మీట్‌ ఎగ్‌ ప్లాన్‌(SMEP) అంటారు. దీనికి అనుగుణంగా శృంగారంలో పాల్గొనడం వల్ల గర్భం ధరించే అవకాశాలు పెరుగుతాయి.

News September 12, 2025

డయేరియాతో ఎవరూ మరణించలేదు: మంత్రి సత్యకుమార్

image

AP: విజయవాడలో ఇప్పటివరకు 141 డయేరియా కేసులు నమోదైనట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఈ వ్యాధితో నగరంలో ఎవరూ మరణించలేదని ఆయన చెప్పారు. న్యూరాజేశ్వరిపేటలోని డయేరియా బాధితులను మంత్రి నారాయణ, MP చిన్నితో కలిసి ఆయన పరామర్శించారు. ‘ఇంటింటి సర్వే చేసి ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. బుడమేరు ప్రాంతంలోని భూగర్భజలాలు కలుషితం అయ్యాయేమోనన్న అనుమానం ఉంది’ అని వ్యాఖ్యానించారు.

News September 12, 2025

రెడ్‌లైట్ థెరపీ గురించి తెలుసా?

image

రెడ్‌లైట్ థెరపీ శరీర సౌందర్యం పెంచే ఓ వైద్య పద్ధతి. గాయాలు మానడానికి, చర్మంపై ముడతలు, మచ్చలు, గీతలు తొలగించడానికి ఈ చికిత్సను ఉపయోగిస్తారు. వృద్ధాప్యంతో వచ్చే చర్మ సంబంధిత సమస్యలనూ ఈ థెరపీ ద్వారా నయం చేస్తారు. ఈ థెరపీ కొత్త చర్మకణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. దీన్ని మొటిమలు, చర్మ క్యాన్సర్ చికిత్సలో కూడా ఉపయోగిస్తారు. ఇది చర్మంలో కొల్లాజెన్‌ను పెంచుతుంది. దీంతో చర్మంపై ముడతలు తగ్గుతాయి.