News January 24, 2025

పాడేరు: మీకోసం కార్యక్రమానికి 109 ఫిర్యాదులు

image

పాడేరులోని ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ మీకోసం కార్యక్రమానికి 109 ఫిర్యాదులు అందాయి. ఐటీడీఏ పీవో వీ.అభిషేక్, జేసీ అభిషేక్ గౌడ్‌తో కలిసి కలెక్టర్ దినేశ్ కుమార్ వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. రహదారి, తాగునీటి సమస్యలపై అధికంగా ఫిర్యాదులు అందాయి. మీకోసంలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News September 18, 2025

VKB: అత్త శ్రద్ధాంజలి బ్యానర్ తీసుకెళ్తూ అల్లుడు మృతి

image

VKB జిల్లా పుల్‌మద్ది గ్రామంలో వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. గ్రామానికి చెందిన లక్ష్మి మరణించడంతో ఆమె శ్రద్ధాంజలి బ్యానర్‌ని అల్లుడు శ్రీనివాస్ పట్టణంలో ప్రింట్ చేసుకొని తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో రోడ్డు గుంతలో బైక్ పడి కింద పడడంతో వెనుక నుంచి వేగంగా వచ్చిన డీసీఎం వాహనం శ్రీనివాస్‌పై నుంచి వెళ్లింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అత్త, అల్లుడు మరణంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

News September 18, 2025

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

image

AP: ఇవాళ్టి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. 10 రోజుల వరకు సభ నిర్వహించే అవకాశముంది. పంచాయతీరాజ్ సవరణ, AP మోటార్ వెహికల్ ట్యాక్స్, SC వర్గీకరణ, మున్సిపల్ చట్టాల సవరణ వంటి 6 ఆర్డినెన్సుల స్థానంలో బిల్లులను ప్రవేశపెట్టే అవకాశముంది. సూపర్-6 మొదలు సాగునీటి ప్రాజెక్టుల వరకు 20 అంశాలపై చర్చించేందుకు TDP ప్రతిపాదించొచ్చు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకెళ్లాలని YCP నిర్ణయించుకున్నట్లు సమాచారం.

News September 18, 2025

ధరూర్: పాత ఫోన్లు కొంటున్నారా: ఎస్ఐ

image

సెకండ్ హ్యాండ్ ఫోన్లతో జాగ్రత్త అవసరమని ఎస్ఐ రాఘవేందర్ హెచ్చరించారు. దొంగలించిన ఫోన్లు లేదా నేరాలను వాడినా ఫోన్లను తక్కువ ధరలకు విక్రయిస్తున్నారని తెలిపారు. వాటిని కొంటే చిక్కుల్లో పడతారని చెప్పారు. కొనుగోలు చేసే ముందు www.ceir.gov.in, వెబ్ సెట్ లో వివరాలు తనిఖీ చేయాలనీ సూచించారు.