News October 3, 2025
పాడేరు: మీకోసం కార్యక్రమానికి 67 ఫిర్యాదులు

పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమానికి 67 ఫిర్యాదులు అందాయి. జేసీ అభిషేక్, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్‌తో కలిసి కలెక్టర్ దినేశ్ కుమార్ వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. రహదారి, తాగునీటి సమస్యలపై అధికంగా ఫిర్యాదులు అందాయని తెలిపారు. మీకోసంలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News October 3, 2025
కడపలో జిందాల్ ఉక్కు ఫ్యాక్టరీ 2028లోగా పూర్తి: CM చంద్రబాబు

AP: ఈ నెల 16న PM మోదీ కర్నూలులో పర్యటించనున్నారని, ఈ పర్యటనను విజయవంతం చేయాలని మంత్రులకు CM చంద్రబాబు సూచించారు. కడపలో జిందాల్ ఉక్కు ఫ్యాక్టరీని 2028లోగా పూర్తి చేస్తామన్నారు. స్థానిక పండుగలను ప్రోత్సహించేలా విజయవాడ ఉత్సవ్ తరహా ఈవెంట్లను అన్ని ప్రాంతాల్లో నిర్వహించాలన్నారు. అసెంబ్లీలో కొందరు MLAలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని, వారిని నియంత్రించే బాధ్యత ఇన్‌ఛార్జ్ మంత్రులదేనని స్పష్టం చేశారు.
News October 3, 2025
జిల్లా అభివృద్ధికి నిధులు విడుదల: కలెక్టర్

జిల్లా అభివృద్ధికి నీతి ఆయోగ్ ద్వారా నిధులు విడుదలైనట్లు కలెక్టర్ ఏ.సిరి తెలిపారు. చిప్పగిరి ఆస్పిరేషనల్ బ్లాక్ అభివృద్ధికి రూ.1.50 కోట్లు కేటాయించారు. ఈ నిధుల్లో అంగన్వాడీల అభివృద్ధికి రూ.35 లక్షలు, గ్రామీణ నీటి సరఫరా పనులకు రూ.95 లక్షలు, పాఠశాలల అభివృద్ధికి రూ.20 లక్షలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. నిర్దేశించిన కాల వ్యవధిలో అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
News October 3, 2025
VKBజిల్లాలో వైన్ షాప్‌ల టెండర్లకు ఒకే దరఖాస్తు.!

VKB జిల్లాలో 59 వైన్ షాపుల టెండర్లకు ఇప్పటి వరకు ఒకే దరఖాస్తు వచ్చినట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయ్ భాస్కర్ గౌడ్ తెలిపారు. వికారాబాద్ జిల్లాలో 59 వైన్ షాపులకుగాను గత నెల 26 నుంచి 18 వరకు టెండర్లలో పాల్గొనేందుకు దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించారు. గత నెల 25న కేవలం ఒక దరఖాస్తు వచ్చినట్లు తెలిపారు. తాండూర్ 18, వికారాబాద్ 12, పరిగి 15, కొడంగల్ 8, మోమిన్‌పేటలో 6 షాప్‌లు ఉన్నాయన్నారు.