News July 5, 2025
పాడేరు: మెగా పేరెంట్స్&టీచర్స్ మీట్‌కు నిధులు విడుదల

అల్లూరి జిల్లాలోని అన్ని విద్యాలయాల్లో ఈనెల 10వ తేదీన నిర్వహించనున్న మెగా పేరెంట్స్&టీచర్స్ మీట్(పీటీఎం)కు రూ.3.05 కోట్లు విడుదలయ్యాయని జిల్లా సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు తెలిపారు. 30 మంది విద్యార్థులు ఉన్న స్కూల్‌కు రూ.10వేలు, 100 మంది ఉంటే రూ.25వేలు, 250 మంది ఉంటే రూ.50 వేలు, 500 మంది ఉంటే రూ.75 వేలు, 500కి పైబడి విద్యార్థులు ఉన్న స్కూల్స్‌కు రూ.లక్ష చొప్పున కేటాయించారన్నారు.
Similar News
News July 5, 2025
ఒంటరితనం.. ఒకరికొకరు పలకరించుకుంటే మేలు!

బంధాలు, బంధుత్వాలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు కుటుంబాల్లో, స్నేహితుల్లో ప్రేమానురాగాలు ఉండేవి. ప్రస్తుతం సంపాదనలో పడి ఒకరి గురించి మరొకరు ఆలోచించడమే మానేశారు. దీంతో ఎంతో మంది ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. దీని వల్ల ప్రతి గంటకు వంద మంది చనిపోతున్నట్లు WHO చెబుతోంది. ఇండియాలో యువత సామాజిక సంబంధాలకు దూరంగా స్క్రీన్‌కు దగ్గరగా ఉంటూ మానసిక, శారీరక సమస్యలు తెచ్చుకుంటోందని పేర్కొంది.
News July 5, 2025
గంభీరావుపేట: ‘చెక్ డ్యాం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి’

గంభీరావుపేట మండలం గోరంటాలలో లోతువాగు వద్ద చెక్ డ్యాం నిర్మాణానికి స్థలాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద లోతువాగు వద్ద చెక్ డ్యాం నిర్మాణానికి సర్వే చేయాలని, నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ పర్యటనలో డీఆర్డీఓ శేషాద్రి, ఎంపీడీవోలు, తహశీల్దార్లు, సంబంధిత అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
News July 5, 2025
NRPT: భర్తను హత్య చేసిన భార్య

ప్రియుడితో మాట్లాడొద్దన్నందుకు భర్తను భార్య గొంతునులిమి హత్య చేసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. NRPT(M) కోటకొండ వాసి అంజిలప్ప(32)కు ధన్వాడ(M) రాంకిష్టయ్యపల్లి వాసి రాధతో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరు HYDలో ఉంటూ కూలి పనిచేస్తూ ఉండేవారు. రాధకు ధన్వాడకి చెందిన యువకుడితో వివాహేతర సంబంధం ఉంది. దీనిపై మందలించిన భర్తను ఆమె గత నెల 23న హత్యచేసింది. కుటుంబసభ్యుల అనుమానం మేరకు విచారించగా విషయం బయటపడింది.