News February 14, 2025

పాడేరు మెడికల్ కాలేజీలో ఉద్యోగాల భర్తీపై కలెక్టర్ స్పందన

image

పాడేరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 34కేటగిరీలలో ఖాళీగా ఉన్న 244పోస్టులను పారదర్శకంగా భర్తీ చేస్తున్నట్లు కలెక్టర్ దినేశ్ కుమార్ శుక్రవారం తెలిపారు. పోస్టులు అమ్ముకుంటున్నారన్న వదంతులు తన దృష్టికి వచ్చిందని, అటువంటి వదంతులు నమ్మవద్దని, ఎవరూ ఎవరికీ డబ్బులు ఇచ్చి మోసపోవద్దని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నోటిఫై చేసిన పోస్టులను రోస్టర్ అనుసరించి మాత్రమే భర్తీ చేస్తున్నామన్నారు.

Similar News

News December 18, 2025

21 ఏళ్లకే సర్పంచ్‌ పదవి

image

TG: పంచాయతీ ఎన్నికల్లో యువత సత్తా చాటారు. సంగారెడ్డి(D) కల్హేర్(M) అలీఖాన్‌‌పల్లిలో BRS బలపరిచిన 21 ఏళ్ల గుగులోతు రోజా(Left) 76 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. సిద్దిపేట(D) అక్కన్నపేట(M) సేవాలాల్ మహారాజ్ తండా సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపరిచిన 22 ఏళ్ల జరుపుల సునీత(Right) 30 ఓట్ల తేడాతో గెలుపొందారు. చిన్న వయసులోనే సర్పంచులుగా గెలుపొందడం పట్ల గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు.

News December 18, 2025

NZB: BJP సర్పంచ్‌లు ఎంతమంది గెలిచారంటే!

image

నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మూడు దశల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 84 మంది సర్పంచులు BJP తరఫున గెలుపొందారు. పార్లమెంట్ పరిధిలోని నిజామాబాద్, జగిత్యాల జిల్లాల పరిధిలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 34 మండలాలు, 642 గ్రామ పంచాయతీల్లో BJP మద్దతుదారులు 299 GPల్లో పోటీ చేసి 84 గ్రామ పంచాయతీల్లో గెలిచారు. ఎంపీ అర్వింద్ తమకు అండదండలు ఇవ్వడంతో పాటు గ్రామస్థులు మద్దతు పలికారని గెలిచిన వారన్నారు.

News December 18, 2025

కడప జిల్లాలో అస్థి పన్ను డిమాండ్ ఎన్ని కోట్లంటే..

image

కడప జిల్లాలో 8 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో ఈ ఆర్థిక సంవత్సరంలో అస్థి పన్ను బకాయిలు రూ.162.81 కోట్లు ఉన్నాయి. ఇందులో ఇప్పటివరకు రూ.64.78 కోట్లు (64.78%) మాత్రమే వసూలైంది. రూ. కోట్లల్లో KDP-100.80 గాను 37.65, PDTR-35.33గాను 13.17, PVLD-8.65 గాను 5.67, JMD-4 గాను 2.62, BDVL-2.73 గాను 2.11, YGL-5.01 గాను 1.87, MYDKR-5.17 గాను 1.36, KMLPRM-1.13 గాను 0.33 కోట్లు మాత్రమే వసూలైంది.