News February 5, 2025

పాడేరు: లక్ష ఎకరాల్లో కాఫీ విస్తరణకు ప్రతిపాదనలు

image

లక్ష ఎకరాల్లో కాఫీ విస్తరణకు, నీడ తోటల పెంపకానికి ప్రతిపాదనలు తయారు చేయాలని కలెక్టర్ దినేశ్ కుమార్ అధికారులను మంగళవారం ఆదేశించారు. రానున్న ఐదేళ్లలో లక్ష ఎకరాల్లో కాఫీ విస్తరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని స్పష్టం చేశారు. ప్రతీ సంవత్సరం 20వేల ఎకరాల్లో కాఫీని విస్తరించాలన్నారు. ఉపాధి హామీ పథకంలో నిర్దేశించిన పనులు పూర్తి చేయకుండా కథలు చెప్పొద్దని, ఉపాధి హామీ పనుల పురోగతిపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

Similar News

News February 5, 2025

రేపు విద్యాకమిషన్ సదస్సు.. UGC నిబంధనలపై చర్చ

image

TG: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC) నిబంధనలపై చర్చించేందుకు విద్యాకమిషన్ రేపు హైదరాబాద్‌లో సదస్సు నిర్వహించనుంది. వర్సిటీల్లో ఆచార్యులు, ఉపకులపతుల నియామకాల గురించి ఈ సదస్సులో చర్చించనున్నారు. యూజీసీ ముసాయిదా నిబంధనలే ప్రధాన చర్చనీయాంశంగా తెలుస్తోంది. ప్రొఫెసర్లు హరగోపాల్, కోదండరాం, తిరుపతిరావు తదితరులు ఈ సదస్సులో పాల్గొంటారని సమాచారం.

News February 5, 2025

నేడు కుంభమేళాకు ప్రధాని మోదీ

image

ప్రధాని మోదీ ఈరోజు మహాకుంభమేళాకు రానున్నారు. ఉదయం ప్రత్యేక విమానంలో ప్రయాగరాజ్‌కు చేరుకోనున్న పీఎం, అక్కడి త్రివేణీ సంగమంలో స్నానమాచరించి పూజలు నిర్వహిస్తారని ఆయన కార్యాలయం తెలిపింది. ప్రధాని రాక దృష్ట్యా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. కాగా.. గత నెల 13న మొదలైన కుంభమేళా ఈ నెల 26తో ముగియనుంది.

News February 5, 2025

ఓపెన్ టెన్త్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

APలో టెన్త్ ఓపెన్ స్కూల్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను సార్వత్రిక విద్యాపీఠం విడుదల చేసింది. మార్చి 17-28 వరకు రోజు విడిచి రోజు ఉ.9.30 నుంచి మ.12.30 వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. 17న హిందీ, 19న ఇంగ్లిష్, 21న తెలుగు/ఉర్దూ/కన్నడ/ఒరియా/తమిళం, 24న మ్యాథ్స్, 26న శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, 28న సోషల్, ఆర్థిక శాస్త్ర పరీక్షలు నిర్వహిస్తారు. కాగా రెగ్యులర్ పదో తరగతి పరీక్షలు మార్చి 17 నుంచి 31 వరకు జరుగుతాయి.

error: Content is protected !!