News February 20, 2025
పాడేరు: సరళ కార్యక్రమంలో 80 మంది ఇంటర్వ్యూలకు ఎంపిక

సరళ కార్యక్రమంతో గిరిజన యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ తెలిపారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో పెదబయలు, ముంచంగిపుట్టు, మంప, సీలేరు తదితర మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు చెందిన 80 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించామన్నారు. ఇందులో 60 మంది ఎంపికయ్యారు. వీరికి సీఈఎంఎస్ సంస్థ శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తుందని ఎస్పీ తెలిపారు.
Similar News
News November 10, 2025
సిద్దిపేట: ప్రజాకవి అందెశ్రీ అందుకున్న పురస్కారాలు

తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన <<18246561>>అందెశ్రీ<<>> KU నుంచి డాక్టరేట్ పొందారు. అశువు కవిత్వం చెప్పడంలో అందెశ్రీ దిట్ట. 2006లో గంగ సినిమాకు నంది పురస్కారం. 2014లో అకాడమి ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్, 2015లో దాశరథి సాహితీ పురస్కారం, 2015లో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం, 2022లో జానకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథీ కృష్ణమాచార్య సాహితీ పురస్కారం, లోక్ నాయక్ పురస్కారం అందుకున్నారు.
News November 10, 2025
కర్రపెండలంలో బోరాన్ లోపం, నివారణ

కర్రపెండలంలో బోరాన్ లోపం వల్ల మొక్కల కణుపుల మధ్య దూరం తగ్గి, మొక్కల పెరుగుదల అంతగా ఉండదు. లేత ఆకులు కుచించుకుపోతాయి. గోధుమ రంగులో జిగురు పదార్ధం ఆకుల కాడలు, కాండం మొవ్వభాగంలో కనిపిస్తుంది. వేరు వ్యవస్థ పెరుగుదల దెబ్బతిని, మొవ్వభాగం ఎండి, దుంపలపై పగుళ్లు వస్తాయి. ఈ లోప నివారణకు ఎకరాకు 4KGల బోరాక్స్ భూమిలో వేసి కప్పాలి. ముచ్చెలను 1% బోరాక్స్ ద్రావణంలో 15 నిమిషాలు ముంచి తర్వాత నాటాలి.
News November 10, 2025
NHSRCలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే ఆఖరు తేదీ

నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంటర్(NHSRC)లో 4 పోస్టులకు దరఖాస్తులు చేయడానికి రేపే ఆఖరు తేదీ. వీటిలో సీనియర్ కన్సల్టెంట్, జూనియర్ కన్సల్టెంట్, సెక్రటేరియల్ ఎగ్జిక్యూటివ్, అకౌంట్స్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిప్లొమా, డిగ్రీ, బీకామ్, ఎంబీఏ, ఎంబీబీఎస్, బీడీఎస్, నర్సింగ్, బీహెచ్ఎంస్, బీఏఎంస్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://nhsrcindia.org/


